Train Fire accident : కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. మూడు ఏసీ బోగీలు కాలిపోయాయి!
విశాఖపట్నం(Vizag) రైల్వే స్టేషన్‌లో(Railway station) అగ్నిప్రమాదం(Fire accident) సంభవించింది.
విశాఖపట్నం(Vizag) రైల్వే స్టేషన్‌లో(Railway station) అగ్నిప్రమాదం(Fire accident) సంభవించింది. విశాఖ రైల్వే స్టేషన్‌లో నిలిచి ఉంచిన కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్(Cobra Vishaka Express) రైలులో మూడు ఏసీ బోగీలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమ క్రమంగా అవి పక్క బోగీలకు కూడా వ్యాపించాయి. దాంతో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. రైల్వేస్టేషన్‌లో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సిబ్బంది మంటలను అదుపు చేసేలోపుగానే బీ6, బీ7, ఎం1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. నిలిపి ఉంచిన రైలు కాబట్టి అందులో ఎవరూ లేరు. దాంతో ప్రాణనష్టం తప్పింది. ఆదివారం ఉదయం ఏడు గంటలకు కోర్బా నుంచి విశాఖకు రైలు వచ్చింది.మెయింటేనెన్స్ తర్వాత అది తిరుమల ఎక్స్‌ప్రెస్‌గా మారుతుంది. ఈ క్రమంలో ఉదయం 10.10 గంటల సమయంలో రైలులోని జీ-7 బోగీలో మంటలు చెలరేగాయి. సిబ్బంది వాటిని ఆర్పేలోగా ఇదర బోగీలకు వ్యాపించాయి. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్య్కూట్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.