గచ్చిబౌలిలోని(Gachibouli) విప్రో సర్కిల్(Wipro circle) చంద్రబాబు నినాదాలతో మారు మోగింది . చంద్రబాబును(Chandrababu) అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వేలాది మంది ఐటీ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబుకు సంఘీభావాన్ని ప్రకటించారు . ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినదించారు. ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.

విప్రో సర్కిల్ వద్ద ఉద్రిక్తత
చంద్రబాబుకు సంఘీభావంగా ఐటీ ఉద్యోగులు ఆందోళన
సైకో పోవాలి..సైకిల్ రావాలని నినాదాలు
జగన్ కు ఐటీ ఉద్యోగులు బుద్ధి చెపుతారని హెచ్చరిక

గచ్చిబౌలిలోని(Gachibouli) విప్రో సర్కిల్(Wipro circle) చంద్రబాబు నినాదాలతో మారు మోగింది . చంద్రబాబును(Chandrababu) అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వేలాది మంది ఐటీ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబుకు సంఘీభావాన్ని ప్రకటించారు . ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినదించారు. ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు వల్లే తామంతా ఉన్నత జీవితాన్ని గడుపుతున్నామని, ఆయన మాత్రం జైల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిజన్ బ్యాచ్..విజన్ బ్యాచ్ ను టార్గెట్ చేసిందని మండిపడ్డారు. బాబు ని వెంటనే విడుదల చేయాలి, ఐయాం విత్ సీబీఎన్ వంటి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ కు ఐటీ ఉద్యోగులు బుద్ధి చెపుతారని హెచ్చరించారు. మరోవైపు ఆ ప్రాంతానికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని, నిరసనకారులను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో(skill development Case) చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల దేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లోని ఎన్నారైల(NRI) నుంచి సైతం వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ ను మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, కుమారస్వామి తదితర నేతలు తప్పుపట్టారు. విపక్ష నేతలను అక్రమంగా అరెస్ట్ చేసే ట్రెండ్ కేంద్రం నుంచి రాష్ట్రాలకు కూడా పాకిందని అఖిలేశ్ విమర్శించారు. ఈ అరెస్ట్ చంద్రబాబుకే లబ్ధి చేకూర్చే అవకాశం ఉందని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఏపీతో పాటు తెలంగాణలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ వైఖరిని తప్పుపడుతూ టీడీపీ మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. ఇంకోవైపు ఈ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఐటీ ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 'ఐయాం విత్ సీబీఎన్' పేరుతో మెయిల్స్, సోషల్ మీడియా ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఇన్విటేషన్ షేర్ అవుతోంది. 'రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలో చంద్రబాబు బాధితుడు. ఈ సంక్షోభ సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది' అంటూ దీనికి సంబంధించిన పోస్టర్ లో పేర్కొన్నారు.

Updated On 13 Sep 2023 6:14 AM GMT
Ehatv

Ehatv

Next Story