విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధించింది

28 ఏళ్ల క్రితం ఇద్దరు దళిత యువకులను శిరోముండనం చేశారనే కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మరో తొమ్మిది మందికి 18 నెలల జైలుశిక్ష విధిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. అయితే గంటల తర్వాత జిల్లా కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో కోనసీమ జిల్లా మండపేట అసెంబ్లీ స్థానానికి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన త్రిమూర్తులు తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చిన వెంటనే జిల్లా కోర్టును ఆశ్రయించారు. 1996 నాటి సంచలనాత్మక కేసులో తాజాగా తీర్పును ప్రకటించింది.

విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధించింది. 18 నెలల జైలు శిక్ష, రూ.1.50 లక్షల జరిమానా విధిస్తున్నట్టు కోర్టు తీర్పు ఇచ్చింది. 1996 డిసెంబర్ 26న వెంకటాయపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో ఐదుగురు దళితుల్ని హింసించి, వీరిలో ఇద్దరికి శిరోముండనం చేయించారనే ఆరోపణలు తోట త్రిమూర్తులుపై ఉన్నాయి. ఆ తర్వాత 1999, 2014లో టీడీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికైన త్రిమూర్తులు.. వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు.

Updated On 16 April 2024 9:05 PM GMT
Yagnik

Yagnik

Next Story