Thota Chandrasekhar : కాపు సంక్షేమం కోసం కేసీఆర్ తరహాలో మీరు కూడా అలా చేయండి
వైసీపీ ప్రభుత్వం కాపుల అభ్యున్నతికి తూట్లు పొడుస్తూ.. వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. హైదారాబాద్‌లో కాపు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..

Thota Chandrashekar Comments On Jagan
వైసీపీ(YSRCP) ప్రభుత్వం కాపుల అభ్యున్నతికి తూట్లు పొడుస్తూ.. వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్(AP BRS Chief Thota Chandrasekhar) అన్నారు. హైదారాబాద్‌లో కాపు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. రాష్ట్ర జనాభాలో అత్యధిక సంఖ్యలో కాపులు ఉండగా వారికి ఎటువంటి సంక్షేమ ఫలాలు అందడం లేదని ఆరోపించారు. సామాజిక, ఆర్ధిక, విద్యా, ఉపాధి రంగాల్లో కాపులు వెనకబాటుకు గురవుతున్నారన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) కాపులకు పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. హైదారాబాద్(Hyderabad) నగరంలోని హైటెక్ సిటీ సమీపంలో సౌత్ ఇండియా సెంటర్ ఫర్ కాపు కమ్యూనిటీ భవన్ కు అత్యంత విలువైన 6.87 ఎకరాల స్థలాన్ని కేటాయించి కేసీఆర్ కాపుల పట్ల తనకున్న చిత్తశుద్దిని చాటుకున్నారని కొనియాడారు.
ఎపీలో కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిన వైసీపీ సర్కార్(YSRCP) అవసరమైన నిధులు కేటాయించకుండా కాపులకు నమ్మక ద్రోహం చేసిందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో కాపుల ఆకాంక్షలకణుగుణంగా రాజధాని ప్రాంతంలో కాపు సంక్షేమ భవన నిర్మాణం కోసం వైసీపీ ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.
