Thopudurthi Prakash Reddy : చంద్రబాబు తిరిగి ఆరోగ్యంగా జైలుకు వెళ్ళాలి
చంద్రబాబు విడుదల సందర్భంగా టీడీపీ నాయకులు జంతు బలి ఇవ్వడం దారుణమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ..

Thopudurthi Prakash Reddy Comments On Chandrababu Release
చంద్రబాబు(Chandrababu) విడుదల సందర్భంగా టీడీపీ(TDP) నాయకులు జంతు బలి ఇవ్వడం దారుణమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి(Thopudurthi Prakash Reddy) అన్నారు. అనంతపురం(Ananthapuram)లో ఆయన మాట్లాడుతూ.. కోర్టులు ఎక్కడా చంద్రబాబు నేరం చేయలేదని చెప్పలేదని.. చంద్రబాబు అరెస్ట్(Arrest) తో టీడీపీ శ్రేణులు విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు విషయంలో న్యాయం గెలిచిందా.. రోగం గెలిచిందా..? అని ప్రశ్నించారు.
మానవతాదృక్పథంతోనే కోర్టు మధ్యంతర బెయిల్(Bail) ఇచ్చిందని అన్నారు. చంద్రబాబు చిత్ర పటానికి పొట్టేళ్ళను బలి ఇచ్చి.. రక్తం పూసి హేయమైన కార్యక్రమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బయటకు రాగానే జంతు బలులు ఇస్తున్నారు.. చంద్రబాబుకు అధికారం వస్తే ఇంకెంత మందిని బలి ఇస్తారోనని సందేహం వ్యక్తం చేశారు. శాశ్వతంగా జైలులో ఉండాల్సిన చంద్రబాబు.. నాలుగు వారాలు వైద్యం కోసం మాత్రమే బయటకు వచ్చారని అన్నారు.
చంద్రబాబు ఇంకొక పదిహేనేళ్లు బతకాలి.. జగన్(Jagan) సీఎంగా ఉండాలని అన్నారు. చంద్రబాబు బతికి ఉన్నంత కాలం.. ప్రజలు జగన్ ను సీఎంగా గెలిపిస్తారని వ్యాఖ్యానించారు. వైద్యం కోసం బయటకు వచ్చిన చంద్రబాబు తిరిగి ఆరోగ్యంగా జైలుకు వెళ్ళాలని కోరుకున్నారు. 2024 కురుక్షేత్ర యుద్దంలో కౌరవులకు పట్టిన గతే.. టీడీపీకి పడుతుందన్నారు. తప్పు చేసిన వాళ్ళు బయట తిరిగితే.. ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయి ఈ దేశం పాకిస్థాన్ లా తయారవుతుందని అన్నారు.
