ప్రపంచమంతా టెక్నాలజీ మయమైంది. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ వివిధ కారణాలతో నిరంతరాయంగా కంప్యూటర్‌ లేదా మొబైళ్లకు కళ్లప్పగించేస్తే కళ్ల అందం, ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం. చాలామందిలో ఇది కంటి అలసటకు, కళ్ల కింద నల్లటి వలయాలు(Dark Cricles) ఏర్పడడానికి కారణమవుతుంది. మరి, ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో చూద్దాం.

ప్రపంచమంతా టెక్నాలజీ మయమైంది. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ వివిధ కారణాలతో నిరంతరాయంగా కంప్యూటర్‌ లేదా మొబైళ్లకు కళ్లప్పగించేస్తే కళ్ల అందం, ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం. చాలామందిలో ఇది కంటి అలసటకు, కళ్ల కింద నల్లటి వలయాలు(Dark Cricles) ఏర్పడడానికి కారణమవుతుంది. మరి, ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో చూద్దాం.

కంప్యూటర్‌(computer) లేదా ఫోన్‌లో సాధ్యమైనంత వరకు ఫాంట్ సైజు పెంచుకోవాలి. ముఖానికి ఎదురుగా ఫ్యాన్ పెట్టుకోవద్దు. గాలి వల్ల కూడా కళ్లు తొందరగా పొడిబారిపోయే అవకాశం. 20-20-20 సూత్రాన్ని తప్పనిసరిగా పాటించాలి. ప్రతి ఇరవై నిమిషాలకోసారి ఇరవై సెకన్ల విరామం(20 seconds Break) తీసుకోండి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై మీ దృష్టిని కేంద్రీకరించండి. లేదా గంటకు అయిదు నిమిషాల పాటు మీ కళ్లకు తగినంత విశ్రాంతినివ్వండి. విశ్రాంతి తీసుకొనే సమయంలో కళ్లను నవ్య, అపసవ్య దిశాల్లో గుండ్రంగా తిప్పాలి.

లేదంటే కళ్లను మూసి ఉంచాలి, చాలామంది కనురెప్ప వేయకుండా కళ్లు పెద్దవి చేసి మరీ స్క్రీన్ వైపు చూస్తూ ఉంటారు. ఇలా చేస్తే కళ్లు పొడిబారి, మంట పెడతాయి. అందుకే తరచుగా రెప్పలు వాల్చుతూ(Blink) ఉండాలి. ఒకవేళ కళ్లు తరచూ పొడిబారుతూ ఉంటే వెంటనే నేత్ర వైద్య నిపుణులను సంప్రదించి ఐడ్రాప్స్ తీసుకోవడం మంచిది. కళ్లు, మానిటర్ ఒకే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల కళ్లు ఎటువంటి ఒత్తిడికి గురికావు.

కళ్లకు, కంప్యూటర్ స్క్రీన్‌కు మధ్య కనీసం 22 నుంచి 28 అంగుళాల దూరం ఉండాలి. దుమ్ము, ధూళి లేకుండా స్క్రీన్‌ను తరచూ శుభ్రం చేసుకోవాలి. మానిటర్‌పై వెలుగు పడకుండా ఉండాలి. అలా కుదరని పక్షంలో కిటికీలు, తలువుల నుంచి స్క్రీన్‌పై నేరుగా వెలుతురు పడకుండా కర్టెన్లు ఉపయోగించాలి. అలాగే స్క్రీన్ బ్రైట్నెస్(Screen brightness), కాంట్రాస్ట్ మనకంటికి సరిపోయే రీతిలో అమర్చుకోవాలి.

కళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యాంటీ రిఫెక్టివ్ కళ్లద్దాలను ఉపయోగించవచ్చు. ఈ విషయంలో వైద్యుని సలహా తప్పనిసరి తీసుకోవాలంటున్నారు. గదిలో ప్రసరిస్తున్న వెలుగుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కలర్ సెటింగ్స్‌ను మార్చే సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. వీటివల్ల గది వెలుతురుకు అనుగుణంగా స్క్రీన్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్ మారుతూ ఉంటాయి. ఫలితంగా, కళ్లపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

కంప్యూటర్‌పై ఎక్కువ సమయం పనిచేసేవారు కాంటాక్ట్ లెన్సులను ఉపయోగించకపోవడం ఉత్తమం. ఎందుకంటే వాటివల్ల కూడా కళ్లు పొడిబారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కంటి ఆరోగ్యం విషయంలో ఆహారం కూడా కీలకమే. ఈ క్రమంలో బీటా కెరోటిన్ అధికంగా ఉండే క్యారెట్స్, చిలగడదుంప, ఆకుకూరలు, లైకోపీన్ ఎక్కువగా లభించే టొమాటో, జామ పండ్లు, ద్రాక్ష పండ్లు వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే డాక్టర్ సలహా మేరకు విటమిన్-ఎ సప్లిమెంట్స్ వాడాలి.

ఒక చిన్న గిన్నెలో చల్లటి పాలు తీసుకొని అందులో రెండు కాటన్ ప్యాడ్స్ ముంచాలి. ఆపై పాలను పూర్తిగా పిండేసి.. ఆ చల్లచల్లటి ప్యాడ్స్‌ను కనురెప్పలపై ఉంచాలి. ఇలా పలుమార్లు చేయడం వల్ల కంటి అలసటను తగ్గించుకోవచ్చు. అలాగే కళ్ల కింద ఏర్పడిన నల్లటి వలయాలూ మాయమవుతాయి. కళ్లు తేమను సంతరించుకుంటాయి.

Updated On 26 Jan 2024 2:32 AM GMT
Ehatv

Ehatv

Next Story