స్మశానంలో(Graveyard) దోచుకోవడానికి ఏముంటుంది. బూడిద తప్ప అక్కడేం దొరకదు. కానీ ఈమధ్య దొంగలు స్మశానాన్ని కూడా వదలడం లేదు. శవాన్ని దహనం చేసిన తర్వాత మిగిలిన పుర్రెలు(Bones), ఎముకలను ఎత్తుకెళుతున్నారు. వీటిని ఏం చేస్తారో, ఎక్కడ అమ్ముకుంటారో తెలియదు కానీ కొందరు యువకులు ముఠాగా ఏర్పడి ఈ దొంగతనాలు చేస్తున్నారు. పెద్దపల్లి(Peddapalli district) జిల్లాలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. జిల్లాలోని సుల్తానాబాద్‌లోని హిందూ స్మశానవాటికలో రెండు రోజుల వ్యవధిలో నలుగురు వ్యక్తులు ఎముకలు దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు.

స్మశానంలో(Graveyard) దోచుకోవడానికి ఏముంటుంది. బూడిద తప్ప అక్కడేం దొరకదు. కానీ ఈమధ్య దొంగలు స్మశానాన్ని కూడా వదలడం లేదు. శవాన్ని దహనం చేసిన తర్వాత మిగిలిన పుర్రెలు(Bones), ఎముకలను ఎత్తుకెళుతున్నారు. వీటిని ఏం చేస్తారో, ఎక్కడ అమ్ముకుంటారో తెలియదు కానీ కొందరు యువకులు ముఠాగా ఏర్పడి ఈ దొంగతనాలు చేస్తున్నారు. పెద్దపల్లి(Peddapalli district) జిల్లాలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. జిల్లాలోని సుల్తానాబాద్‌లోని హిందూ స్మశానవాటికలో రెండు రోజుల వ్యవధిలో నలుగురు వ్యక్తులు ఎముకలు దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు. మృతదేహాలను దహనంచేసిన తర్వాత మిగిలిపోయిన ఎముకలను ఓ సంచీలో వేసుకుని తీసుకెళుతున్నారు. మూడు రోజుల కిందట ఇద్దరు యువకులు ఇలా ఎముకలు తీసుకెళుతుండగా స్థానికులు పట్టుకున్నారు. దాంతో వారు ఎముకల్ని అక్కడే వదిలివేశారు. ఆ యువకులను బెదిరించి అక్కడి నుంచి పంపించివేశారు. శనివారం ఇద్దరు మహిళలు కూడా శ్మశానంలో ఎముకలను ఏరుకుంటూ అక్కడి మున్సిపల్‌ సిబ్బందికి పట్టుపడ్డారు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా స్మశానాల్లో ఎముకలు మాయమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాలను దహనం చేసిన తర్వాత మిగిలిన అస్థికలను కుటుంబసభ్యులు సేకరిస్తారు. వాటిని 5, 9, 11వ రోజుల తర్వాత పవిత్ర నదులలో కలుపుతారు. అయితే, కొన్నిరోజులుగా స్మశానంలో అస్థికలు కనిపించకపోవడంతో దహనమప్పుడు అవి కూడా కాలి బూడిదయ్యాయని భావించారు కానీ ఎముకలను దొంగలు ఎత్తుకెళ్లి ఉంటారని ఊహించలేదు. ఇప్పుడు దొంగలు దొరికారు కాబట్టి తమవారి అస్థికలను కూడా వారే ఎత్తుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అసలు వారు ఎముకలను ఎందుకు ఎత్తుకెళుతున్నారో, వాటిని ఏం చేస్తారో విచారణలో స్పష్టం కానుంది.

Updated On 19 Feb 2024 12:38 AM GMT
Ehatv

Ehatv

Next Story