విజయదశమి నుంచి విశాఖ(Vishakapatanam) నుంచి పరిపాలన సాగించేందుకు కేబినేట్(Cabinet) నిర్ణయించినట్లు మంత్రి చెల్లబోయిన వేణు గోపాలకృష్ణ(Venu Gopala Krishna) తెలిపారు. విశాఖకు కార్యాలయాల తరలింపుకు కేబినేట్ ఆమోదం తెలిపిందని, విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు వివరించారు. సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం నాడు కేబినేట్ భేటీ జరిగింది.

విజయదశమి నుంచి విశాఖ(Vishakapatanam) నుంచి పరిపాలన సాగించేందుకు కేబినేట్(Cabinet) నిర్ణయించినట్లు మంత్రి చెల్లబోయిన వేణు గోపాలకృష్ణ(Venu Gopala Krishna) తెలిపారు. విశాఖకు కార్యాలయాల తరలింపుకు కేబినేట్ ఆమోదం తెలిపిందని, విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు వివరించారు. సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో బుధవారం నాడు కేబినేట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. కేబినేట్ నిర్ణయాలను సచివాలయ పబ్లిసిటీ సెల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి చెల్లుబోయిన వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ప్రభుత్వ కమిటీ సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ఈ భేటీలో కీలకంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలు చేసే బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. ఉద్యోగి రిటైర్డ్‌ అయిన సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటి స్థలం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్‌ అయ్యేలా చర్యలు తీసుకునేందుకు కేబినేట్ అంగీకరించిందన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల పిల్లలకు కూడా ఫీజు రియింబర్స్‌ మెంట్‌ కింద ప్రయోజనాలు అందేలా చూసేలా నిర్ణయం తీసుకుందన్నారు.

కేబినేట్ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే..

కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ చేసేందుకు నిర్ణయించింది. తద్వారా.. 10,115 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 11,630 మంది ఏపీవీపీలో పనిచేసే ఉద్యోగులకు మేలు చేకూరుతుంది.

ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యేనాటికి ఇంటి‌స్థలం అందించాలని నిర్ణయం తీసుకున్నాం. దాన్ని ప్రభుత్వ బాధ్యతగా తీసుకుంటాం. అలాగే.. రిటైర్ అయిన ఉద్యోగుల కుటుంబాల పిల్లలకు ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ అమలు చేయాలని నిర్ణయించాం.

క్యాన్సర్ రోగులకు మరింత వైద్య సేవలకోసం గుంటూరు, వైజాగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో 350 పోస్టుల భర్తీకి నిర్ణయం. 53 వేల ఉద్యోగాలను వైద్య అరోగ్య శాఖలో ఇప్పటి వరకు ఇచ్చాం. ఒక్క ఖాళీ కూడా ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాం. ఒంగోలు,ఏలూరు, విజయవాడ లోని నర్సింగ్‌ కాలేజీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌. ఆరోగ్య సురక్ష ద్వారా మరింత మేలైన వైద్యం అందించాలని‌ నిర్ణయం. సురక్ష క్యాంపులలో మంత్రులు,ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం జగన్‌ ఆదేశించారు. సెప్టెంబరు 30న ప్రారంభమై 45 రోజులపాటు క్యాంపులు జరుగుతాయి. కురుపాం మెడికల్ కాలేజీలో 50 % గిరిజనులకు సీట్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది కేబినెట్‌.

జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకం ఏర్పాటు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ కు ఎంపికైన ఏపీ అభ్యర్ధులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహనికి కేబినేట్ ఆమోదం తెలిపింది. దీని కింద సివిల్స్ ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్ధులకు లక్ష రూపాయలు, మెయిన్స్ లో అర్హత సాధిస్తే మరో రూ. 50 వేలు అదనంగా అందించనున్నారు. సామాజికంగా, ఆర్దికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఈ ప్రోత్సాహకం అందించనున్నారు.

కాకినాడ బల్క్ డ్రగ్ ప్రాజెక్టును నక్కపల్లికి తరలిస్తూ నిర్ణయం. ప్రభుత్వ భూమిలోనే ఈ ప్రాజెక్టును‌ పెట్టాలని కేంద్రం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం.

హైకోర్టు లో 28 మంది డ్రైవర్ల నియామకానికి నిర్ణయం.

భూదాన్ చట్టంలో సవరణలకు ఆమోదం.

ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లుకి ఆమోదం.

పోలవరం ముంపు బాధితులకు 8,424 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం.

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు, పీఓటీ చట్ట సవరణకు ఆమోదం.

దేవాదాయ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం.

విశాఖపట్నంలో ఐదు ఎకరాల్లో ఓ భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది కేబినెట్‌. వైజాగ్ పరిపాలనా రాజధాని అనేది ఆల్రెడీ నిర్ణయం జరిగింది. పరిపాలనా సౌలభ్యం ప్రకారం జరుగుతుంది. రాజధానిగా తక్కువ ఖర్చుతో వైజాగ్ పూర్తవుతుంది.

తొమ్మిది మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయం.

Updated On 20 Sep 2023 7:25 AM GMT
Ehatv

Ehatv

Next Story