ఇదివరకే లేఖలో రాసిన విధంగా నాలుగు వారాల సమయం కావాలని స్పీకర్‌ను(Speaker) కోరారు.
ఆనం రామనారాయణ రెడ్డి(Ramana Reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kottam Reddy Sridhar reddy), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి(), ఉండవల్లి శ్రీదేవి(Undavalli Sridevi) స్పీకర్‌ కార్యాలయానికి వచ్చారు. న్యాయ నిపుణులతో సంప్రదించేందుకు వీడియో, పేపర్‌ క్లిప్పింగుల వాస్తవ నిర్ధారణకు సమయం అవసరమని వారు అన్నారు.

ఇదివరకే లేఖలో రాసిన విధంగా నాలుగు వారాల సమయం కావాలని స్పీకర్‌ను(Speaker) కోరారు.
ఆనం రామనారాయణ రెడ్డి(Ramana Reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kottam Reddy Sridhar reddy), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి(), ఉండవల్లి శ్రీదేవి(Undavalli Sridevi) స్పీకర్‌ కార్యాలయానికి వచ్చారు. న్యాయ నిపుణులతో సంప్రదించేందుకు వీడియో, పేపర్‌ క్లిప్పింగుల వాస్తవ నిర్ధారణకు సమయం అవసరమని వారు అన్నారు. సహజ న్యాయసూత్రాల ప్రకారం తాము కోరిన వెసులు బాటు కల్పించాలని స్పీకర్‌కు విన్నవించినట్లు చెప్పారు. తమపై దాఖలైన పిటిషన్లపై వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని స్పీకర్‌ను కోరామని, అందుకు ఆయన నిరాకరించినందుకే నేరుగా వెళ్లి కలిశామని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి చెప్పారు. తన అనారోగ్యంపై వైద్యులు నివేదిక ఇచ్చినా స్పీకర్‌ పరిగణనలోకి తీసుకోలేదని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) గంటా శ్రీనివాసరావు(Srinivas Rao) రాజీనామాపై మూడున్నరేళ్లపాటు పట్టించుకోని శాసనసభాపతి తనకు నోటీసు ఇచ్చిన రెండు వారాల్లోనే సమాధానం ఇవ్వమంటున్నారని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. తాను క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడుతున్నానని ఆరోపణలు చేస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలు స్పీకర్‌ ఏమైనా ఇస్తారేమో చూస్తానన్నారు. తాను కొవిడ్‌తో బాధపడుతున్నానని, ఇంకా సెలైన్‌ పెట్టుకుంటూనే ఉన్నానని ఉండవల్లి శ్రీదేవి వాపోయారు. వివరణ ఇవ్వడానికి స్పీకర్‌ను సమయం కోరినట్లు తెలిపారు.

Updated On 29 Jan 2024 7:11 AM GMT
Ehatv

Ehatv

Next Story