Varma vs Nagababu : వర్మ-నాగబాబు మధ్య మళ్లీ మొదలైన మాటల యుద్ధం
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma), నటుడు నాగబాబు(Nagababu) సోషల్ మీడియాలో(Social Media) ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవవడం ఇదేం మొదటిసారి కాదు. అనేకసార్లు వారి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఘాటుగా తిట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి మళ్లీ తిట్టుకోవడం మొదలుపెట్టారు.
రామ్‌గోపాల్‌వర్మ వ్యూహం(Vyuham) అనే సినిమా తీశారుగా..!
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma), నటుడు నాగబాబు(Nagababu) సోషల్ మీడియాలో(Social Media) ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవవడం ఇదేం మొదటిసారి కాదు. అనేకసార్లు వారి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఘాటుగా తిట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి మళ్లీ తిట్టుకోవడం మొదలుపెట్టారు.
రామ్‌గోపాల్‌వర్మ వ్యూహం(Vyuham) అనే సినిమా తీశారుగా..! అది వివాదాస్పదమైన విషయం తెలిసే ఉంటుంది. సినిమాను ఆపేయాలంటూ నారా లోకేశ్(Nara Lokesh) కోర్టుకు వెళ్లడం, వర్మ కూడా తన వాదనలను వినిపించడం తెలిసిన విషయాలే! ఈ నేపథ్యంలోనే ఓ టీవీ చానెల్ వ్యూహం సినిమాపై చర్చ పెట్టింది. ఈ చర్చలో తెలుగుదేశంపార్టీకి చెందిన కార్యకర్త కమ్ అమరావతి రైతు సంఘం అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ తల తీసుకొస్తే కోటి రూపాయలిస్తానని చెప్పాడు. దీనిపై ఆర్జీవీ మండిపడ్డారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాల్సిందిగా(Seurity) ఏపీ డీజీపీని(AP DGP) కలిసి లేఖ ఇచ్చారు.
అయితే ఈ మొత్తం వ్యవహారంపై నాగబాబు స్పందించారు. తల నరికితే కోటి ఇస్తానని అనడంపై నాగబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో రామ్‌గోపాల్ వర్మపై సెటైర్లు వేశారు. నాగబాబు ఏమన్నారంటే...
రామ్‌గోపాల్‌వర్మ గారు మీరు భయపడకండి. మీ జీవితానికి ఏ ఢోకా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను మాటిస్తున్నాను. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ లో.. ఆ మాటకొస్తే, ఇండియాలో ఏ పనికిమాలిన వెధవ మీకు ఎటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో-విలన్ కొట్టుకుంటుంటే, మధ్యలో కమెడియన్ గాడ్ని ఎవ్వరూ చంపరు కదా!' అని నాగబాబు చెప్పారు. వర్మను ఓ కమెడియన్‌గా తీసిపడేశాడు. ఎలాంటి బెంగా లేకుండా నిశ్చితంగా వోడ్కా తాగేసి పడుకోమని సలహా ఇచ్చాడు. రామ్‌గోపాల్ వర్మ ఏమైనా తక్కువవారా? ఆయన కూడా నాగబాబుకు అదే రేంజ్‌లో స్పందించారు.
'సర్, నా కంటే పెద్ద కమెడియన్ ఎవరంటే, నా సినిమాలో మీరు' అంటూ రివర్స్ పంచ్ విసిరాడు. తన వ్యూహం సినిమాలో నాగబాబు పాత్ర ఉందని, అందులో అతడు మంచి కామెడీ చేశాడని వర్మ రివర్స్ స్వింగ్ వేశాడు. తన గురించి ఎక్కువగా ఆలోచించవద్దని, తమ్ముడు పవన్ కల్యాణ్(Pawan kalyan) దగ్గర డబ్బులు అడుక్కొని టీ తాగి పడుకోవాలని నాగబాబుకు వర్మ ఉచిత సలహా ఇచ్చాడు.