Fire Accident : టైరు పేలి బస్సు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం
అనంతపురం(Ananthapuram) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శింగనమల(Shinganamala) మండల పరిధిలో అనంతపురం-తాడిపత్రి ప్రధాన రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో ప్రమాదం సంభవించింది. టైరు పేలడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు(Fire) చెలరేగాయి. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు బెంగళూరు(Banglore) నుండి బనగానపల్లె(Banaganapalle)కి వెళ్తుండగా ఘటన జరిగింది.

Tire exploded and the bus caught fire
అనంతపురం(Ananthapuram) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. శింగనమల(Shinganamala) మండల పరిధిలో అనంతపురం-తాడిపత్రి ప్రధాన రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో ప్రమాదం సంభవించింది. టైరు పేలడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు(Fire) చెలరేగాయి. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు బెంగళూరు(Banglore) నుండి బనగానపల్లె(Banaganapalle)కి వెళ్తుండగా ఘటన జరిగింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. శనివారం(Saturday) తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగినప్పుడు బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.
