తిరుమలలో(Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Salakatla Brahmotsavam) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు, బుధవారం ఉదయం శ్రీమలయప్ప స్వామి(Sri Malayappaswamy) సింహవాహనంపై(lion chariot) యోగ నరసింహుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సింహవాహనంపై స్వామివారి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు.

తిరుమలలో(Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Salakatla Brahmotsavam) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు, బుధవారం ఉదయం శ్రీమలయప్ప స్వామి(Sri Malayappaswamy) సింహవాహనంపై(lion chariot) యోగ నరసింహుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సింహవాహనంపై స్వామివారి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల మధ్య స్వామివారి వాహన సేవ నేత్రపర్వంగా సాగింది. భక్త జన బృందాల భజనలు, కోలాటాలు సరేసరి! దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కోసం స్వామివారు సింహవాహనాన్ని అధిరోహించారు. పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సింహం సంకేతం. ఉదయం మనం నిద్రలేవగానే దర్శించే వస్తువులలో సింహ దర్శనం అత్యంత ముఖ్యమైనది!సింహరూప దర్శనంతో పైన తెలిపిన శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. ఇక బుధవారం రాత్ర ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతారు. ఇదిలా ఉంటే బ్రహ్మోత్సవాల సందర్శనార్థం విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, తిరుమల అదనపు ఎస్పీ ముని రామయ్యతో కలిస జియో ట్యాగింగ్‌ కట్టడం ప్రారంభించారు.

Updated On 20 Sep 2023 12:19 AM GMT
Ehatv

Ehatv

Next Story