'నా మెదడును(Mind) కొందరు మెషీన్‌(Machine) ద్వారా నియంత్రిస్తున్నారు. అది పనిచేయకుండా చైతన్యరహితం చేయాలి.

నా మెదడును(Mind) కొందరు మెషీన్‌(Machine) ద్వారా నియంత్రిస్తున్నారు. అది పనిచేయకుండా చైతన్యరహితం చేయాలి. అందుకు ఆదేశాలు ఇవ్వాలి ' అని ఒక ఉపాధ్యాయుడు(Teacher) సుప్రీం కోర్టులో(Supreme court) పిటిషన్(Petetion) దాఖలు చేశారు. కొందరు వ్యక్తులు హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైంటిఫిక్‌ ల్యాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్‌) నుంచి మనిషి మెదడును చదివే పరికరాన్ని కొని, దాంతో తన మెదడును నియంత్రిస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఉపాధ్యాయుడొకరు సుప్రీం కోర్టుతో మొరపెట్టుకున్నాడు. సుప్రీం కోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ (ఎస్‌సీఎల్‌ఎస్‌సీ)కి దానిని పంపారు. దీంతో పిటిషన్‌దారుడి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న కమిటీ అతడి మెదడును ఎవరూ మిషిన్ తో నియంత్రణ చేయడం లేదని తెలిపింది. దాంతో సుప్రీం కోర్టు అతడి పిటిషన్‌ను కొట్టివేసింది. ఇదే వ్యక్తి ఇదే అంశంపై 2022 లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు కూడా దానిని అసంబద్ధమని చెప్తూ పిటిషన్ ను కొట్టివేసింది.

Updated On 14 Nov 2024 8:35 AM GMT
Eha Tv

Eha Tv

Next Story