Supreme Court : జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీం విచారణ
జగన్(CM Jagan) అక్రమాస్తుల కేసుపై సుప్రీం(Supreme court) కోర్టువిచారణ జరిపింది. ఈ క్రమంలో ట్రయల్ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐని(CBI) సుప్రీం కోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

Supreme Court
జగన్(CM Jagan) అక్రమాస్తుల కేసుపై సుప్రీం(Supreme court) కోర్టువిచారణ జరిపింది. ఈ క్రమంలో ట్రయల్ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐని(CBI) సుప్రీం కోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా ఆలస్యమవుతోందని సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రయల్ సవ్యంగానే జరుగుతోందని ధర్మాసనానికి సీబీఐ తెలిపింది. సవ్యంగా జరుగుతుందని చెప్పడం కాదు అఫిడవిట్ ఎందుకు ఫైల్ చేయలేదో చెప్పాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు.
