నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ(Nadipalli Suryachandra Chakra Jagadamba)..పేరు పెద్దగా ఉందని షార్ట్‌గా బుజ్జి అని పేరుపెట్టుకుందామె! కోనసీమ జిల్లా అంగరలో ఉంటోంది.

నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ(Nadipalli Suryachandra Chakra Jagadamba)..పేరు పెద్దగా ఉందని షార్ట్‌గా బుజ్జి అని పేరుపెట్టుకుందామె! కోనసీమ జిల్లా అంగరలో ఉంటోంది. పెళ్లి అయ్యింది కానీ భర్త చనిపోయాడు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ బొమ్మూరు(Bommuru)లో నివసిస్తోంది. ఈమె ఏం చేస్తుందయ్యా అంటే.. వయసు మళ్లినవారితో పరిచయం ఏర్పరుచుకుంటుది. ఎలాగోలా వాళ్లింట్లో పని మనిషిగా చేరుతుంది. తక్కువ జీతానికే పనికి కుదురుతుంది. అలా ఫస్టే కొన్ని మార్కులు కొట్టేస్తూ తర్వా తన పనితనంతో ఇంటివారి మెప్పు పొందుతుంది. నమ్మకం ఏర్పరచుకుంటుంది. కొన్నాళ్లకు అన్నంలోనో, టీ-కాఫీల్లోనో లేకపోతే ప్రసాదంలోనో హైడోస్‌ మత్తు మందు కలిపి ఇస్తుంది. వారు గాఢ నిద్రలోకి వెళ్లిపోగానే ఒంటిపై ఉన్న నగలతో పాటు ఇంట్లో ఉన్న వెండి బంగారం , నగదు తీసుకుని చెక్కేస్తుంది. దొంగిలించిన బంగారాన్ని బ్యాంకుల్లోనో, ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీల్లోనో తనఖా పెట్టి డబ్బులు తీసుకుంటుంది. వాటితో ఎంజాయ్‌ చేస్తుంది. కాకినాడ(Kakinada),తూర్పు గోదావరి(west Godhavari) జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి(East Godhavari)జిల్లాలోని తణుకు(Tanuku),తాడేపల్లిగూడెం(Tadepalligudem)తదితర పోలీసు స్టేషన్లలో ఈమెపై కేసులు ఉన్నాయి. పది కేసులలో నేరం రుజువయ్యి జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ఇలాంటి దొంగతనాలపై కంప్లయింట్లు వస్తుండటంతో పోలీసులు అలెర్టయ్యారు. మహిళ ఫోటోతో ప్రజలను అప్రమత్తం చేశారు. మొత్తంగా ఆమెను ఈ నెల 18వ తేదీన పట్టుకున్నారు.

ehatv

ehatv

Next Story