AP High Court : నూతన రిజిస్ట్రేషన్ విధానంపై హైకోర్టులో పిల్.. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం
జగన్(Jagan) సర్కార్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్(Registration) విధానంపై హైకోర్టులో(High court) దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) నేడు విచారణకు వచ్చింది. నూతన రిజిస్ట్రేషన్ విధానం.. రిజిస్ట్రేషన్ చట్టాలకు వ్యతిరేకమంటూ కంకిపాడుకు చెందిన కొత్తపల్లి శివరాం ప్రసాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
జగన్(Jagan) సర్కార్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రిజిస్ట్రేషన్(Registration) విధానంపై హైకోర్టులో(High court) దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) నేడు విచారణకు వచ్చింది. నూతన రిజిస్ట్రేషన్ విధానం.. రిజిస్ట్రేషన్ చట్టాలకు వ్యతిరేకమంటూ కంకిపాడుకు చెందిన కొత్తపల్లి శివరాం ప్రసాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. భారతీయ సాక్షి చట్టంలో నిర్దేశించిన విధంగా.. సాక్షులు లేని దస్తావేజులు చెల్లనివిగా పరిగణించబడతాయని.. ఈ నూతన రిజిస్ట్రేషన్ విధానంలో అటువంటి అవకాశం లేనందున ప్రభుత్వం ఇచ్చిన జీవోని కోట్టి వేయాలంటూ న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
అనుభవం లేని వార్డు సెక్రటరీల ద్వారా కూడా ఈ రిజిస్ట్రేషన్ విధానం అమలు పరచడం ద్వారా.. కొన్ని లక్షల మంది ఆస్తుల రిజిస్ట్రేషన్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని న్యాయవాది శ్రవణ్ కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ఆస్తులకు సంబంధించిన పత్రాలు అందించకుండా కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తామంటూ చేసిన ప్రకటన.. రిజిస్ట్రేషన్ చట్టాలకు వ్యతిరేకమంటూ కోర్టులో వాదనలు వినిపించారు. వాదనలపై స్పందించిన ధర్మాసనం.. ప్రిన్సిపల్ సెక్రెటరీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ లను కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశించింది.