Nominations : జగన్‌పై పోటీకి 37 మంది నిలవగా.. మరి పవన్‌పై పోటీకి ఎన్ని నామినేషన్స్ వేశారో తెలుసా.?
ఏపీలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఏపీలోని 25 లోక్‌సభ స్థానలకు గాను 555 మంది అభ్యర్థులు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
ఏపీలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఏపీలోని 25 లోక్‌సభ స్థానలకు గాను 965 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా.. ఇక 175 అసెంబ్లీ స్థానాలకు గాను 5,460 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ప్రముఖులు పోటీ చేసే స్థానాలలో కూడా నామినేషన్లు ఎక్కువగానే నమోదయ్యాయి. వాటి వివరాలు తెలుసుకుందాం..
జగన్ పోటీచేసే పులివెందుల నుంచి 37 నామినేషన్స్ దాఖలు కాగా.. చంద్రబాబు పోటీచేసే కుప్పం నుంచి 32 నామినేషన్లు నమోదయ్యాయి. ఇక జనసేన అధినేత పవన్ పోటీ చేసే పిఠాపురం నుంచి 19 నామినేషన్స్ నమోదవగా.. లోకేష్ పోటీచేసే మంగళగిరి నుంచి 65 నామినేషన్లు దాఖలయ్యాయి. బాలకృష్ణ పోటీ చేసే హిందూపురం నుంచి 19 నామినేషన్స్ నమోదవగా.. బీజేపీ చీఫ్ పురేందేశ్వరి పోటీ చేసే రాజమండ్రి పార్లమెంట్ నుంచి 22 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేసే కడప పార్లమెంట్ నుంచి 42 నామినేషన్స్ నమోదయ్యాయి. మే 13న పోలింగ్ జరుగనుండగా.. వీరిలో విజేతలు ఎవరో జూన్ 4వ తేదీన తేలనుంది.