తెలుగు రాష్ట్రాలు భానుడి భగభగలతో మండిపోతున్నాయి. తీవ్రమైన ఎండలు సెగపుట్టిస్తున్నాయి. గడపదాటి బయటకు వెళ్లడానికి ప్రజలు జంకుతున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ భయంకర పరిస్థులు ఉంటాయని, సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్‌ అధిక ఉష్ణోగ్రలు నమోదవుతాయని వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరించింది.

తెలుగు రాష్ట్రాలు భానుడి భగభగలతో మండిపోతున్నాయి. తీవ్రమైన ఎండలు సెగపుట్టిస్తున్నాయి. గడపదాటి బయటకు వెళ్లడానికి ప్రజలు జంకుతున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ భయంకర పరిస్థులు ఉంటాయని, సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్‌ అధిక ఉష్ణోగ్రలు నమోదవుతాయని వాతావరణ శాఖ(Department of Meteorology) హెచ్చరించింది. బలమైన వడగాడ్పులతో(Heat waves) జనం పిట్టల్లా రాలిపోతున్నారు. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, వడదెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో ఎండ తీవ్రత చాలా అధికంగా ఉంది. జంట నగరాలలోని రోడ్లన్నీ మధ్యాహ్నం 12 గంటలు దాటితే చాలు నిర్మానుష్యమవుతున్నాయి. నిప్పుల కొలిమిలో ఉన్నట్టుగా అనిపిస్తోంది.

ఉత్తర, ఈశాన్య, తూర్పు తెలంగాణ(Telangana) జిల్లాలలో 40 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌(Waranagal) జిల్లాలో వడదెబ్బ తగిలి ఇద్దరు చనిపోయారు. మహబూబాబాద్‌(Mahbubabad)జిల్లా తోర్రూరు మండలం గుర్తూరులో మత్స్యకారుడు 30 ఏళ్ల పెసర రాజు స్థానిక పెద్ద చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. మరో ఘటనలో వరంగల్‌ జిల్లా సంగెం మండలం గవిచర్లకు చెందిన 28 ఏళ్ల పావని కూలీ పనులకు వెళ్లింది.

తీవ్రమైన ఎండలకు తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యింది. వాంతులు, విరోచనాలు కావటంతో చికిత్స కోసం ఎంజీఎం దవాఖానకు తరలిస్తుండగా ప్రాణాలొదిలింది. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో అత్యధికంగా 46.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఖమ్మం జిల్లా ఖానాపూర్‌లో 45.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా సూర్యుడు చెలరేగిపోతున్నాడు. బుధవారం రాయలసీమ జిల్లాల్లో ఎండ నిప్పులు చెరిగింది. తిరుపతి(Tirupati) జిల్లా పల్లాం, నెల్లూరు జిల్లా కసుమూరులో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిపూట అనేక ప్రాంతాల్లో 36 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated On 18 May 2023 12:46 AM GMT
Ehatv

Ehatv

Next Story