Forecast Report : రెండ్రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తారు వర్షాలు
వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్(West Bengal), ఒడిశా(Odisha) తీరాలకు ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

Forecast Report
వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్(West Bengal), ఒడిశా(Odisha) తీరాలకు ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. రానున్న 24 గంటల్లో ఛత్తీస్‌గడ్‌వైపు అల్పపీడనం ప్రయాణిస్తుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రుతుపవన ద్రోణి రాజస్తాన్‌లోని జైసల్మేర్ నుంచి అల్పపీడన ప్రాంతం వరకు కొనసాగుతోంది. రాష్ట్రం మీదుగా పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో అనేక చోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
