గాజు(Glass) పగిలేకొద్దీ పదునెక్కుతుంది.. ఈ డైలాగు ఉస్తాద్‌ భగత్‌సింగ్‌(Usthad Bhagath singh) టీజర్‌లో వినిపించింది. జనసేన(Janasena) అభిమానులకు తెగ నచ్చేసింది. సోషల్‌ మీడియాలో(Social media) వైరల్ అయ్యింది. ఇప్పుడు నిజంగానే గాజు గ్లాసు బద్దలయ్యింది. జనసేన పార్టీకి ఎన్నికల కమిషన్(ELection Commission) ఇచ్చిన షాక్‌ అలాంటిదిలాంటిది కాదు.. ఆ పార్టీకి గ్లాస్‌ గుర్తు కేటాయించలేదు.

గాజు(Glass) పగిలేకొద్దీ పదునెక్కుతుంది.. ఈ డైలాగు ఉస్తాద్‌ భగత్‌సింగ్‌(Usthad Bhagath singh) టీజర్‌లో వినిపించింది. జనసేన(Janasena) అభిమానులకు తెగ నచ్చేసింది. సోషల్‌ మీడియాలో(Social media) వైరల్ అయ్యింది. ఇప్పుడు నిజంగానే గాజు గ్లాసు బద్దలయ్యింది. జనసేన పార్టీకి ఎన్నికల కమిషన్(ELection Commission) ఇచ్చిన షాక్‌ అలాంటిదిలాంటిది కాదు.. ఆ పార్టీకి గ్లాస్‌ గుర్తు కేటాయించలేదు. ఇప్పటి వరకు జనసేన గుర్తు అయిన గాజుగ్లాస్‌ను ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్‌గా పేర్కొనడంతో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ డైలాగుకు అర్థం లేకుండా పోయింది. జ‌న‌సేన పార్టీ కేవ‌లం రిజ‌స్ట‌ర్డ్ పార్టీ కావ‌డం వ‌ల్లే గాజు గ్లాస్‌ను ఆ పార్టీకి కేటాయించేందుకు ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. మొత్తం మీద గాజు గ్లాస్ అయితే ప‌గిలింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఏకకాలంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల జాబితాతో పాటు గుర్తింపు లేని పార్టీల లిస్ట్‌ కూడా విడుదల చేసింది. బీజేపీ, కాంగ్రెస్‌లను జాతీయ పార్టీలుగా, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలను ప్రాంతీయ పార్టీలుగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. ఇదే సమయంలో జనసేనపార్టీని రిజిస్టర్డ్ పార్టీగా గుర్తిస్తూ ఈసీ గెజిట్‌లో పేర్కొంది. ఆయా పార్టీలకు గుర్తులను కూడా కేటాయించింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఫ్యాన్‌, తెలుగుదేశంపార్టీకి సైకిల్‌ గుర్తులను కేటాయించింది. జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్‌గా పేర్కొంది. ఇది జనసేన నేతలకు షాక్‌కు గురి చేసింది. ఎన్నికలలో గాజు గ్లాసును ఫ్రీ సింబల్‌గా ఉంచడంతో నిబంధనల ప్రకారం ఆ గుర్తును కోరుకున్న వారికి కేటాయించే అవకాశం ఉంది.

Updated On 2 April 2024 5:05 AM GMT
Ehatv

Ehatv

Next Story