Chandrababu's custody petition : చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై రేపు ఉదయం 11.30 గంటలకు తీర్పు
టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై(Chandrababu's custody petition) వాదనలు ముగిశాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill Development Case) అరెస్ట్ చేసిన చంద్రబాబును ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ(CID) పిటిషన్ దాఖలు చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై(Chandrababu's custody petition) వాదనలు ముగిశాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill Development Case) అరెస్ట్ చేసిన చంద్రబాబును ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ(CID) పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. సీఐడీ తరుఫున అదనపు ఏజీ సుధాకర్ రెడ్డి(Sudhakar Reddy), చంద్రబాబు(Chandrababu) తరుఫున సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా(Siddharth Luthra) వాదనలు వినిపించారు.
చంద్రబాబును కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని సీఐడీ తరుఫు న్యాయవాది వాదించగా.. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని.. రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారని సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. మూడు గంటలపాటు పాటు వాదనలు విన్న విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి తీర్పును రేపటికి వాయిదా వేశారు. గురువారం ఉదయం 11.30 గంటలకు చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వెలువరిస్తామని జడ్జి తెలిపారు.