ఏపీ ముఖ్యమంత్రి జగన్(Jagan), వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలకు(Vijayasai Reddy) విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు(CBI) అనుమతిని మంజూరు చేసింది. లండన్ లో(London) ఉన్న తన కుమార్తెను చూసేందుకు అనుమతిని ఇవ్వాలని ముఖ్య‌మంత్రి జగన్ సీబీఐ కోర్టును కోరారు. దీంతో సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది.

యూనివర్శిటీలతో ఒప్పందాల కోసం ఎంపీ విజయసాయి రెడ్డి కోర్టు అనుమ‌తి కోర‌గా.. నెల రోజుల పాటు విదేశాలకు వెళ్లేందుకు అనుమతించింది. విజయసాయి రెడ్డి యూకే, యూఎస్‌, జర్మనీ, దుబాయ్, సింగపూర్ దేశాల్లో పర్యటించనున్నారు.

ముఖ్యమంత్రి జగన్, భార‌తి దంప‌తులు సెప్టెంబర్ మొదటి వారంలో లండన్‌ పర్యటనకు వెళ్లనున్నారు. లండన్‌లో చదువుకుంటున్న కుమార్తె వద్దకు వెళ్తున్న సీఎం జ‌గ‌న్‌.. సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 9 వరకూ యూకే టూర్‌లో ఉంటారు. ప‌లు కేసులు విచార‌ణ‌లో ఉన్నందున్న విదేశాల‌కు వెళ్లేందుకు కోర్టు అనుమ‌తి తీసుకున్నారు సీఎం జ‌గ‌న్‌.

Updated On 31 Aug 2023 11:05 AM GMT
Ehatv

Ehatv

Next Story