Jyestabhishekam : తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం
తిరుమల శ్రీవారి ఆలయంలో(Tirumala Temple) ఈ రోజు అంటే19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకం(Jyestabhishekam) జరగనుంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో(Tirumala Temple) ఈ రోజు అంటే19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకం(Jyestabhishekam) జరగనుంది. అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనాల కారణంగా శ్రీదేవి, భూదేవి, మలయప్పస్వామి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైఖానసాగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఈ ఉత్సవం చేప డతారు. దీనిని ‘అభిధేయక అభిషేకం’(Abhideyaka Abishekam)అని కూడా అంటారు. మొదటిరోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత స్వామి, అమ్మవార్లకు వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు. రెండో రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. మూడో రోజు కూడా తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు.