ThatiParthi ChandraShekar: నాన్నకు తోడుగా గడపగడపకు ప్రచారంలో పాల్గొన్న తాటిపర్తి ఆకాంక్ష
ఎర్రగొండపాలెంలో (Erragondapalem) వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ (Tatiparthi Chndrashekar) ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గడగడపకు తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజాసమ్యలను తెలుసుకుంటూ తాను గెలిస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ముందుకెళ్తున్నారు.

tatiparthi-compressed
ఎర్రగొండపాలెంలో (Erragondapalem) వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ (Tatiparthi Chndrashekar) ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గడగడపకు తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజాసమ్యలను తెలుసుకుంటూ తాను గెలిస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాటిపర్తి చంద్రశేఖర్‌కు కూతురు, భార్య కూడా తోడయ్యారు. యర్రగొండపాలెం నియోజక వర్గం దోర్నాలలో పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి తాటిపర్తి చంద్రశేఖర్ కుమార్తె తాటిపర్తి ఆకాంక్ష (Thatiparthi Akanksha), భార్య భాగ్య సీమ చౌదరి పాల్గొన్నారు. చంద్రరశేఖర్ కుటుంబ సభ్యుల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తన తండ్రి చంద్రశేఖర్‌ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. అలాగే గడప గడపకు తిరుగుతు ఫ్యాన్ గుర్తుకి ఓటు వెయాలని, వైఎస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలని, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని, తన తండ్రిని భారీ మెజార్టీలతో గెలిపించాలని ప్రజలను ఆకాంక్ష కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
