AP Assembly Elections 2024 : ఆంధ్రప్రదేశ్‌లో తటస్థులు ఎవరివైపు?
ఎన్నికల్లో(Elections) తటస్థుల(Thatastulu) ఓటు చాలా కీలకం. వీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ విజయం సాధిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(AP Elections) కూడా తటస్థులే కీలకపాత్రను పోషించబోతున్నారు. తటస్థులలో ఎక్కువ శాతం మంది ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) పక్షానే ఉన్నారట! కారణమేమిటంటే గత ఎన్నికలలో జగన్ ఇచ్చిన హామీలను 98 శాతం వరకు నెరవేర్చడమేనట! జగన్‌పై విపక్ష పార్టీలు, టీడీపీ(TDP) అనుకూల మీడియాలు అడ్డదిడ్డమైన విమర్శలు చేస్తుండటం కూడా తటస్థులకు నచ్చడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఎన్నికల్లో(Elections) తటస్థుల(Thatastulu) ఓటు చాలా కీలకం. వీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ విజయం సాధిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో(AP Elections) కూడా తటస్థులే కీలకపాత్రను పోషించబోతున్నారు. తటస్థులలో ఎక్కువ శాతం మంది ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) పక్షానే ఉన్నారట! కారణమేమిటంటే గత ఎన్నికలలో జగన్ ఇచ్చిన హామీలను 98 శాతం వరకు నెరవేర్చడమేనట! జగన్‌పై విపక్ష పార్టీలు, టీడీపీ(TDP) అనుకూల మీడియాలు అడ్డదిడ్డమైన విమర్శలు చేస్తుండటం కూడా తటస్థులకు నచ్చడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు తటస్థులకు ఎంతగానో నచ్చాయట! ముఖ్యంగా జగన్ నిజాయతీ, నిబద్ధత తటస్థ ఓటర్లను ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu), జనసేన(Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ల(Pawan kalayan) వ్యవహారశైలిపై తటస్థులు ఆగ్రహంగా ఉన్నారట! ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులను చెప్పుకోకుండా, అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పకుండా ఎంతసేపూ జగన్‌పై విమర్శలు చేస్తూ ఉండటం ప్రజలకు నచ్చడం లేదు. ఎన్నికలకు 20 రోజుల సమయం కూడా లేదు. ఇంత వరకు తామేం చేస్తామో కూటమి చెప్పలేదని జనం అనుకుంటున్నారు. సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేధం వంటి ఒకట్రెండు హామీలను మినహాయిస్తే జగన్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారు. జగన్ పాలనలో ప్రజలకు జరిగిన నష్టమేమీ లేదనే అభిప్రాయం జనాల్లో ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ వచ్చిందని, నేరుగా ఇంటిదగ్గరే పాలన అందిస్తున్న ఘనత జగన్‌కే దక్కుతుందని పార్టీలతో సంబంధం లేనివారు అంటున్నారు. మొత్తంగా తటస్థులలో ఎక్కువ శాతం మంది జగన్ వెంటే ఉన్నారు.