కర్నూలులో(Kurnool) గ్రామ పంచాయతీ నిధులు, సర్పంచుల హక్కుల పరిరక్షణపై బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన టీజీ వెంకటేష్(T.G Venkatesh) మాట్లాడుతూ.. కేంద్ర ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు వైఎస్ఆర్ పార్టీ(YSRCP) మద్దతిస్తుంది. అందుకే రాష్ట్రాభివృద్ధి కొరకు కేంద్రం అవసరమైనన్ని నిధులు సమకూరుస్తా ఉందని అన్నారు. 8300 కోట్ల రూపాయలు గ్రామాల అభివృద్ధికి కేంద్రం కేటాయించడం జరిగిందని..

కర్నూలులో(Kurnool) గ్రామ పంచాయతీ నిధులు, సర్పంచుల హక్కుల పరిరక్షణపై బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన టీజీ వెంకటేష్(T.G Venkatesh) మాట్లాడుతూ.. కేంద్ర ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు వైఎస్ఆర్ పార్టీ(YSRCP) మద్దతిస్తుంది. అందుకే రాష్ట్రాభివృద్ధి కొరకు కేంద్రం అవసరమైనన్ని నిధులు సమకూరుస్తా ఉందని అన్నారు. 8300 కోట్ల రూపాయలు గ్రామాల అభివృద్ధికి కేంద్రం కేటాయించడం జరిగిందని.. అంతేకాకుండా గ్రామీణ రోడ్లకు, పాఠశాలల అభివృద్ధికి, మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే కేంద్రం నిధులు ఇవ్వడం ఆపుతుందని హెచ్చ‌రించారు. గ్రామీణ అభివృద్ధికి కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించి, సరైన లెక్క చూపిస్తే మరిన్ని నిధులు పంచాయతీలకు కేంద్రం ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి కేటాయిస్తున్న వివిధ పథకాల నిధులన్నీ పక్కదారి పట్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. కేంద్ర నిధులు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు కూడా పరిపాలన సాగించే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో కేంద్రం చేస్తున్నటువంటి జాతీయ రహదారుల అభివృద్ధి తప్ప, ఎటువంటి రోడ్లు నిర్మించిన దాఖలాలు లేవని అన్నారు.

రాష్ట్ర మంత్రులు ప్రత్యర్థి పార్టీ వాళ్లను తిట్టడానికి, విమర్శించడానికి సమయం సరిపోతుందని.. మంత్రులు తమ శాఖలలో ఏమి జరుగుతుందో అన్న అవగాహన కూడా మంత్రులకు లేదని విమ‌ర్శించారు. అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయ‌ని అన్నారు.

Updated On 10 Aug 2023 4:31 AM GMT
Ehatv

Ehatv

Next Story