రాష్ట్ర పరిశ్రమలు మ‌రియు వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రిగా టి.జి. భరత్ బాధ్యతలు చేపట్టారు.

రాష్ట్ర పరిశ్రమలు మ‌రియు వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రిగా టి.జి. భరత్ బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యత చేపట్టేందుకు రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణకుంభం తోను, అధికారులు పుష్ప గుచ్చాలను అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. పండితుల వేద మంత్రోచ్ఛారణ ల మధ్య టీజీ భ‌ర‌త్ తన‌ సీట్లో కూర్చున్నారు.

మంత్రిగా విసిఐసి రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫైల్ పై ఆయ‌న తొలి సంతకం చేశారు. ఏపీఐఐసీల్లో భూముల లీజు కాల పరిది పెంచే ఫైలు పై రెండో సంతకం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుజరాత్ తరహాలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా పారిశ్రామికంగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామని, గుజరాత్ లో ఉన్న గిఫ్ట్ సిటీ తరహాలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.

రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు అనువైన వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పిస్తామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామన్నారు. పెండింగ్లో ఉన్న పారిశ్రామిక రాయితీలను వెంటనే విడుదల చేస్తామన్నారు. 2014-19, 2019-24 మధ్యకాలంలో జరిగిన ఎంఓయూలన్నీ రియలైజ్ అయ్యేవిధంగా, పరిశ్రమలన్నీ స్థాపించే విధంగా చర్యలు చేపడతామన్నారు. కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు.

Updated On 20 Jun 2024 4:46 AM GMT
Eha Tv

Eha Tv

Next Story