Tenth Class Results: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల నేడే!!
10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 30న ముగిశాయి. ఏప్రిల్ 1న మూల్యాంకనం
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను నేడు విడుదల చేయనున్నట్టు పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ వెబ్‌సైట్‌లో 2023–24 టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్‌గా, మరో 1.02 లక్షల మంది ప్రైవేట్ గాను పరీక్షలు రాశారు.
10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 30న ముగిశాయి. ఏప్రిల్ 1న మూల్యాంకనం ప్రారంభమైంది. SCSC బోర్డు పరీక్షల విభాగం గతంలో ప్రకటించిన ప్రణాళిక ప్రకారం మొత్తం ప్రక్రియను పూర్తి చేసినట్లు పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 26 జిల్లాల్లో 25 వేల మంది ఉపాధ్యాయులు 47,88,738 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు. ఏపీ 10వ తరగతి పరీక్షలకు 6,30,633 మంది హాజరయ్యారు. 25 వేల మంది ఉపాధ్యాయులను నియమించి 47,88,738 జవాబు పత్రాల మూల్యాంకనానికి 26 జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో ఏర్పడిన ఇబ్బందులను అధిగమించేందుకు ఈ ఏడాది గరిష్టంగా 900 మంది మూల్యాంకనాధికారులు మూల్యాంకన కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు.పరీక్షలు జరిగిన కేవలం 22 రోజుల్లోనే ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది. పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30 వరకు నిర్వహించారు. దాదాపు 6,30,633 మంది విద్యార్థులకు పదో తరగతి పరీక్షలకు ఫీజు చెల్లించగా, వారిలో 6,16,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.