Bandaru Satyanarayana Murthy : బండారు సత్యనారాయణ అరెస్టుకు రంగం సిద్ధం..!
మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి అరెస్టుకు రంగం సిద్ధం అయ్యింది. దీంతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Tension Prevailed after Police Arrives TDP Leader Bandaru Satyanarayana Residence to his Arrest
మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి(Bandaru Satyanarayana Murthy) అరెస్టు(Arrest)కు రంగం సిద్ధం అయ్యింది. దీంతో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనకాపల్లి(Anakapalli) జిల్లా వెన్నెలపాలెం(Vennelapalem)లోని బండారు సత్యనారాయణమూర్తి నివాసం వద్ద అర్ధరాత్రి దాటాక పెద్ద ఎత్తున పోలీసులను మోహరించడంతో స్థానికంగా కలకలం రేగింది. బండారు నివాసానికి వెళ్లే దారిలోని సినిమా హాలు సెంటర్, విద్యుత్ సబ్ స్టేషన్ సెంటర్, వెన్నెలపాలెం ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణమూర్తిపై కేసు నమోదయ్యింది. ఈ క్రమంలోనే బండారు ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు.
బండారు సత్యనారాయణ ఇటీవల మంత్రి రోజా(Minister Roja)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ(Vasireddy Padma) డీజీపీ(DGP)కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పరవాడ డీఎస్పీ కె.వి. సత్యనారాయణ(KV Satyanarayana), సీఐ ఈశ్వరరావు(CI Eshwar Rao) భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు. ప్రహరీ గేట్లు తీసుకుని లోపలికెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు బండారు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
