ఇంకో ఆరు రోజులు. నేతల రాజకీయ భవిష్యత్తును తేల్చే సమయం ఆసన్నమయ్యింది. కౌంటింగ్‌కు(Poll Counting) కౌంట్‌ డౌన్‌ మొదలయ్యింది. జూన్‌ 4వ తేదీ ఎప్పుడొస్తుందా అని సకలజనులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయపార్టీలు(Political parties) కౌంటింగ్‌ ఏజెంట్లను రెడీ చేసుకుంటున్నాయి. ప్రజల నాడి ఎలా ఉండబోతున్నదో తెలియక నేతలు టెన్షన్‌ పడుతున్నారు. జుట్టున్నవారు పీక్కుంటున్నారు. లేనివారు తలలు బాదుకుంటున్నారు.

ఇంకో ఆరు రోజులు. నేతల రాజకీయ భవిష్యత్తును తేల్చే సమయం ఆసన్నమయ్యింది. కౌంటింగ్‌కు(Poll Counting) కౌంట్‌ డౌన్‌ మొదలయ్యింది. జూన్‌ 4వ తేదీ ఎప్పుడొస్తుందా అని సకలజనులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయపార్టీలు(Political parties) కౌంటింగ్‌ ఏజెంట్లను రెడీ చేసుకుంటున్నాయి. ప్రజల నాడి ఎలా ఉండబోతున్నదో తెలియక నేతలు టెన్షన్‌ పడుతున్నారు. జుట్టున్నవారు పీక్కుంటున్నారు. లేనివారు తలలు బాదుకుంటున్నారు. టైమ్‌ దగ్గరపడుతున్న కొద్దీ నేతల హార్ట్ బీట్‌ పెరుగుతూ పోతున్నది. ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతున్నాయో పోటీ చేసిన అభ్యర్థుల బ్లడ్‌ ప్రషర్‌ కూడా అలాగే పెరుగుతున్నది. అధికార పార్టీకేమో అధికారాన్ని నిలుపుకోగలమా అన్ని టెన్షన్‌. విపక్షాలదేమో ప్రజలు అవకాశమిస్తారో లేదో అన్న టెన్షన్‌. అధికారంలోకి రాకపోతే పార్టీ మనుగడ కష్టమవుతుందేమోనన్న దిగులు టీడీపీలో(TDP) ఉంది. మరో అయిదేళ్ల పాటు విపక్షంలో కూర్చోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతోంది. అధికారపక్షంలోనూ అంతే! భవిష్యత్తుపై కొంచెం భయం. మరికొంచెం ఆందోళన ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందెప్పడూ చూసి ఉండం. ఎన్నికలయ్యాక కూడా కొన్ని చోట్ల ఉద్రిక్తతలు, హింసాయుత సంఘటనలు చోటు చేసుకున్నాయి. కౌంటింగ్‌ అప్పుడు ఎలా ఉంటుందో! అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టే పోలీసు యంత్రాంగం అప్రమత్తతతో ఉన్నది.

Updated On 29 May 2024 3:33 AM GMT
Ehatv

Ehatv

Next Story