మెడిసిన్‌ చదవడానికి కిర్గిజ్‌స్తాన్‌కు(Kyrgyzstan) వెళ్లిన తెలుగు విద్యార్థి(Telugu student) దుర్మరణం చెందాడు. జలపాతం చూసేందుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. అనకాపల్లి(anakapalli) జిల్లా మాడుగులకు చెందిన హల్వా వ్యాపారి భీమరాజు రెండో కొడుకు దాసరి చందు (20) వైద్య విద్య కోసం ఏడాది కిందట కిర్గిజ్‌స్తాన్‌ వెళ్లాడు.

మెడిసిన్‌ చదవడానికి కిర్గిజ్‌స్తాన్‌కు(Kyrgyzstan) వెళ్లిన తెలుగు విద్యార్థి(Telugu student) దుర్మరణం చెందాడు. జలపాతం చూసేందుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. అనకాపల్లి(anakapalli) జిల్లా మాడుగులకు చెందిన హల్వా వ్యాపారి భీమరాజు రెండో కొడుకు దాసరి చందు (20) వైద్య విద్య కోసం ఏడాది కిందట కిర్గిజ్‌స్తాన్‌ వెళ్లాడు. పరీక్షలు ముగియడంతో యూనివర్సిటీ అధికారులే ఆదివారం విద్యార్థులను దగ్గరలో ఉన్న మంచు జలపాతం సందర్శనకు తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయిదుగురు విద్యార్థులు జలపాతంలో దిగారు. వారిలో చందు మంచులో కూరుకుపోయి చనిపోయాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడారని అనకాపల్లి ఎంపీ సత్యవతి పేర్కొన్నారు.

Updated On 23 April 2024 1:39 AM GMT
Ehatv

Ehatv

Next Story