Weather Updates : అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి..
చైత్రం ఇంకా చిగురుతొడగనే లేదు అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. గ్రీష్మంలో(Summer) పరిస్థితి ఎలా ఉంటుందో తల్చుకుంటేనే భయమేస్తోంది. తెలుగు రాష్ట్రాలలో(Telugu states) రోజువారీ కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు నాలుగు డిగ్రీల వరకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
చైత్రం ఇంకా చిగురుతొడగనే లేదు అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. గ్రీష్మంలో(Summer) పరిస్థితి ఎలా ఉంటుందో తల్చుకుంటేనే భయమేస్తోంది. తెలుగు రాష్ట్రాలలో(Telugu states) రోజువారీ కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు నాలుగు డిగ్రీల వరకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోని(Telangana) పలు ప్రాంతాల్లో శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి. నిరుడు ఇదే రోజు ఇంచుమించు 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అంటే అయిదు డిగ్రీలు పెరుగుదల అన్నమాట! ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమ, దక్షిణ రాయలసీమ ప్రాంతాలు, పశ్చిమ తెంగాణలో ఎండల తీవ్రత ఊహించనదాని కంటే ఎక్కువగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు భయంకరంగా ఉండవచ్చని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. మార్చి మాసం నుంచి మే మాసం వరకు జమ్ము కశ్మీర్, తమిళనాడు మినహా అన్ని ప్రాంతాల్లో వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ సారి ఎండలు ఎక్కువగా ఉంటాయని చాన్నాళ్లుగా వాతావరణ శాఖ చెబుతూ వస్తున్నది. ఎన్‌నినో ప్రభావం గత సంవత్సరం జూలై నుంచి కొనసాగుతున్నది. వర్షాకాలంలో కరువు వచ్చింది. గత వంద సంవత్సరాలలో ఎప్పుడూ చూడని పరిస్థితి నిరుడు ఆగస్టులో నెలకొన్నది. ఏప్రిల్ నాటికి ఎల్‌నినో ప్రభావం ముగియనున్నది.