శివరాత్రి(Shiva rathri) రోజున చలి శివశివ అంటూ వెళ్లిపోతుందని, అప్పట్నుంచి ఎండలు మొదలవుతాయని అంటుంటారు. అదేమిటో ఇంకా శివరాత్రి అయినా రాలేదు అప్పుడే ఎండలు(Heat) దంచికొడుతున్నాయి. చలి ఎప్పుడో పరారయ్యింది.
శివరాత్రి(Shiva rathri) రోజున చలి శివశివ అంటూ వెళ్లిపోతుందని, అప్పట్నుంచి ఎండలు మొదలవుతాయని అంటుంటారు. అదేమిటో ఇంకా శివరాత్రి అయినా రాలేదు అప్పుడే ఎండలు(Heat) దంచికొడుతున్నాయి. చలి ఎప్పుడో పరారయ్యింది. రోజు రోజుకూ పగటి ఉష్ణోగ్రతలు(Temperatures) పెరుగుతున్నాయి. గత ఏడాది కంటే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. కూలర్లు(Cooler), ఏసీల(AC) వాడకం అప్పుడే మొదలయ్యింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 37 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. మొన్నటి వరకు చలి చంపుకుతింటే ఇప్పడేమో ఎండలు ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి. ఇక మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో ఎండలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన మొదలయ్యింది. వ్యవసాయపనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పుతున్నారు. మరోమూడు నెలలు ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉందని, వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు.