జైలులో ఉన్న చంద్రబాబును(chandrababu) కలిసేందుకు ఆయ‌న‌ సతీమణి భువనేశ్వరి(Bhuvaneshwari) దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తును(Mulakat Application) జైలు అధికారులు తిరస్కరించారు. దీంతో వారానికి మూడుసార్లు ములాఖత్‍కు అవకాశం ఉన్నా తిరస్కరించారని ఆమె ఆవేదన వ్య‌క్తం చేశారు. చంద్రబాబు అరెస్టు(Chandrababu) తర్వాత భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు.

జైలులో ఉన్న చంద్రబాబును(chandrababu) కలిసేందుకు ఆయ‌న‌ సతీమణి భువనేశ్వరి(Bhuvaneshwari) దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తును(Mulakat Application) జైలు అధికారులు తిరస్కరించారు. దీంతో వారానికి మూడుసార్లు ములాఖత్‍కు అవకాశం ఉన్నా తిరస్కరించారని ఆమె ఆవేదన వ్య‌క్తం చేశారు. చంద్రబాబు అరెస్టు(Chandrababu) తర్వాత భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు. ములాఖత్‍పైనా ప్రభుత్వం అవమానీయంగా వ్యవహరిస్తోందని భువనేశ్వరి మండిప‌డ్డారు. నిబంధనల ప్రకారం ములాఖత్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా కాదనడంపై భువనేశ్వరి ఆవేదన వ్య‌క్తం చేశారు.

ఇదిలావుంటే.. చంద్రబాబు అరెస్ట్, విచారణ, తదనంతరం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నారా లోకేశ్ ఢిల్లీ వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్​పై లోక్​సభలో చర్చ కోసం లోకేశ్ ఆయా పార్టీ ఎంపీలతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు కేసు విషయంలోనూ సుప్రీంకోర్టు న్యాయవాదులతో లోకేశ్ చర్చించనున్న‌ట్లు స‌మాచారం. నారా లోకేశ్ వెంట టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు కూడా ఉన్న‌ట్లు తెలుస్తుంది.

Updated On 15 Sep 2023 1:25 AM GMT
Ehatv

Ehatv

Next Story