తెలుగు వాడుకా భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి 161 జయంతి పురస్కరించుకొని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవంలో 17 మంది కళాకారులను అవార్డులతో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.

తెలుగు వాడుకా భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి 161 జయంతి పురస్కరించుకొని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవంలో 17 మంది కళాకారులను అవార్డులతో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. తెలుగు భాష పరిరక్షణకు, భాషకు, కళల కోసం కృషి చేసిన అవార్డు గ్రహీతలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. ఈ సందర్భంగా కళాకారులకు నగదు బహుమానం, జ్ఞాపిక, సర్టిఫికెట్, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

అవార్డులు అందుకున్న వారిలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన డ్రామా ఆర్టిస్ట్ ఆచంట బాలాజి నాయుడు, ప్రకాశం జిల్లాకు చెందిన సామాజిక డ్రామా ఆర్టిస్ట్ పాటిబండ్ల ఆనంద రావు, పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన తోలుబొమ్మలాట కళాకారుడు వనపర్తి దుర్గారావు, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓకల్ కార్నటిక్ కళాకారుడు మల్లాది సురిబాబు, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆంధ్రా నాట్య కళాకారుడు శారద రామకృష్ణ, గుంటూరుకు చెందిన చిత్రకారుడు ఎస్. విజయ కుమార్, పల్నాడుకు చెందిన రచయిత డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, గుంటూరుకు చెందిన రచయిత బొర్రా గోవర్థన్, చిత్తూరుకు చెందిన రచయిత పలమనేరు బాలాజి, కోనసీమకు చెందిన రచయిత పి. సత్యనారాయణ రెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన రచయిత జి. లక్ష్మీ నరసయ్య, బాపట్లకు చెందిన రచయిత చల్లపల్లి స్వరూప రాణి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన క్రిటిక్ డాక్టర్ కేవీఎన్డీ వర ప్రసాద్, ఆచార్య మూలే విజయలక్ష్మీ, కొండపల్లికి చెందిన సాంబశివరావు, అశోక్ కుమార్, మదుమూడి సుధాకర్ లు ఉన్నారు.

అవార్డులు స్వీకరించిన అనంతరం ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓకల్ కార్నటిక్ కళాకారుడు మల్లాది సురిబాబు, సుకన్య దంపతులు తమకు అవార్డు రూపంలో అందిన నగదును అన్నాక్యాంటీన్ కు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆ దంపతులను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story