Actor Raja Joined Congress : కాంగ్రెస్లో చేరిన నటుడు, పాస్టర్ రాజా
సినీ నటుడు(Actor), పాస్టర్(Paster) రాజా(Raja) కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. ఆనంద్(Anand) సినిమాతో హిట్ కొట్టిన రాజాకు.. ఆ తర్వాత విజయాలు లేవు. చాలా సినిమాలలో నటించిన ఏ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. దీంతో చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఆ తర్వాత పాస్టర్ గా కనిపించి అందరినీ షాక్ కు గురి చేశాడు.
సినీ నటుడు(Actor), పాస్టర్(Paster) రాజా(Raja) కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. ఆనంద్(Anand) సినిమాతో హిట్ కొట్టిన రాజాకు.. ఆ తర్వాత విజయాలు లేవు. చాలా సినిమాలలో నటించిన ఏ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. దీంతో చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఆ తర్వాత పాస్టర్ గా కనిపించి అందరినీ షాక్ కు గురి చేశాడు. ఇప్పుడు పొలిటికల్(Politics) గా కూడా తన లక్ ను పరీక్షించుకోవాలని అనుకుంటూ ఉన్నాడు రాజా. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరాడు రాజా. విజయవాడ ఆంధ్రరత్న భవన్(Andhra Ratna Bhavan) లో బుధవారం పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు(Gidugu Rudraraja) ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.
అనంతరం రాజా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి నేను ముందు నుంచి అభిమానిని అని చెప్పారు. సినిమాలు, ఆ తరువాత ఆధ్యాత్మిక జీవితంతో కొంతకాలం పార్టీకి దూరమయ్యానని అన్నారు. మణిపూర్ అల్లర్ల సందర్భంగా దేశంలో ఎవ్వరూ కూడా సాహసించని విధంగా రాహుల్ గాంధీ స్పందించిన తీరు తనను ఎంతో ప్రభావితం చేసిందని.. అదే స్పూర్తితో తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా తనకు ఏ బాధ్యత అప్పగించినా నెరవేరుస్తానని రాజా తెలిపారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను అందరూ చూస్తున్నారని రాజా అన్నారు. అందరికీ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని అన్నారు.