వికేంద్రీకరణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan Mohan Reddy) రాయ‌ల‌సీమ‌కు కేటాయించిన తెలుగు అకాడమీ కేంద్ర కార్యాలయం తిరుపతి(tirupathi) నుంచి పని చేస్తోందని.. అందులో ఎలాంటి అనుమానం వద్దని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి(Lakshmi Parvathi) స్పష్టం చేశారు. కార్యాలయ నిర్మాణం కోసం రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి(Makireddy Purushottama Reddy), తెలుగు భాషోద్యమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సాకం నాగరాజు(Nagaraju) తో కిలిసి తిరుపతి పరిసర ప్రాంతాల్లో స్థ‌ల పరిశీలన చేశారు.

వికేంద్రీకరణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan Mohan Reddy) రాయ‌ల‌సీమ‌కు కేటాయించిన తెలుగు అకాడమీ కేంద్ర కార్యాలయం తిరుపతి(tirupathi) నుంచి పని చేస్తోందని.. అందులో ఎలాంటి అనుమానం వద్దని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి(Lakshmi Parvathi) స్పష్టం చేశారు. కార్యాలయ నిర్మాణం కోసం రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి(Makireddy Purushottama Reddy), తెలుగు భాషోద్యమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సాకం నాగరాజు(Nagaraju) తో కిలిసి తిరుపతి పరిసర ప్రాంతాల్లో స్థ‌ల పరిశీలన చేశారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ రామారావు.. ఏర్పేడు మండలంలోని రెండు ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని లక్ష్మీ పార్వతికి చూపించారు.

ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. వికేంద్రీకరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో అత్యంత కీలకమైన ప్రాధాన్యత అంశం. వికేంద్రీకరణ కోసం ఈ ప్రభుత్వం ఎంత శ్రద్ద తీసుకుంటుందో ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం.. హైదరాబాద్ లో ఉన్న తెలుగు అకాడమీని ఏపీకి తీసుకురావడానికి కనీస ప్రయత్నం చేయలేదు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు అకాడమీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకురావడం కోసం మొదట హైకోర్టు.. తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్లి సాధించార‌ని విషయం గుర్తు చేశారు

ఆర్థిక పరిమితులు, తెలంగాణతో న్యాయ వ్యాజ్యం తర్వాత అకాడమీని గత రెండు సంవత్సరాలుగా నడుపుతున్నామని తెలిపారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో కార్యకలాపాల నిర్వహణ జరుగుతుంది. స్థలం ఎంపిక చేసుకుని కార్యాలయం నిర్మాణం కూడా చేస్తామని తెలిపారు. రాయలసీమ ప్రజలు అడగకుండానే తిరుపతికి తెలుగు అకాడమీని కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సంస్థ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తున్నారని.. వికేంద్రీకరణ విషయంలో రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

Updated On 29 Jun 2023 6:53 AM GMT
Ehatv

Ehatv

Next Story