TS High Court : సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు
ఏపీ సీఎం వైఎస్ జగన్(AP CM YS Jagan) కు తెలంగాణ హైకోర్టు(TS High Court) నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య (Ex Mp Harirama Jogaiah)వేసిన పిల్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌పై విచారణ జరిపింది.

TS High Court
ఏపీ సీఎం వైఎస్ జగన్(AP CM YS Jagan) కు తెలంగాణ హైకోర్టు(TS High Court) నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య (Ex Mp Harirama Jogaiah)వేసిన పిల్ పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌పై విచారణ జరిపింది. ముందుగా.. పిల్ గా పరిగణించేందుకు.. రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై వాదనలు జరుగగా.. పిల్ లో సవరణలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. హరిరామ జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. పిల్‌ను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు అంగీకారం తెలిపింది. హరి రామ జోగయ్య పిల్ కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. అలాగే ప్రతివాదులు జగన్, సీబీఐకీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే(AP Assembly Elections 2024) కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని హరిరామ జోగయ్య పిటిషన్‌లో కోరారు.
