విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ APCC భారీ బహిరంగ సభ నిర్వ‌హించింది ఈ స‌భ‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ APCC భారీ బహిరంగ సభ నిర్వ‌హించింది ఈ స‌భ‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. ఈ సభ ను చూస్తుంటే నేను విశాఖ లో ఉన్నట్లు లేదు.. నాకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సభ పెట్టినట్లు ఉందని అన్నారు. ఇక్కడకు వద్దాం అనుకున్నప్పుడు కాంగ్రెస్ ఏపీలో లేదు అని అన్నారు. అక్కడకు పోతే కాంగ్రెస్ పరువు పోతుంది ఏమో అని అన్నారు. నేను వైఎస్సార్ బిడ్డ షర్మిల సభ పెడితే ఎలా ఉటుందో చెప్పా. ఇక్కడ సభ చూస్తే షర్మిల న్యాయకత్వం ఎలా ఉందో అర్ధం అవుతుందన్నారు. ఆంధ్ర ప్రాంతంలో ప్రశ్నించే గొంతులు లేవ‌న్నారు. ఢిల్లీ నుంచి మోడీ ఆంధ్ర ను పాలిస్తున్నాడు అంటే ఇక్కడ ప్రశ్నించే గళం ఇంతవరకు లేదన్నారు. 10 ఏళ్లు అయినా పోలవరం కట్టలేదు.. 10 ఏళ్లు దాటినా రాజధాని కట్టలేదు.. తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. రాష్ట్రాలుగా విడిపోయాం.. తెలుగు బిడ్డలు గా కలిసి ఉండాలన్నారు. బీజేపీ అంటే ఇవ్వాళ బాబు, జగన్, పవన్ అన్నారు. వీళ్ళు మోడీ బ‌లం, భలగం అని ఆరోపించారు. వీళ్లకు ఓటేస్తే మోడీకి ఓటు వేసినట్లేన‌న్నారు. ఢిల్లీలో మోడీ నీ నిలదీసే దమ్ము లేదన్నారు. అంతా ముత్యాల ముగ్గు బ్యాచ్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖ‌త‌మ్‌ అని అన్నారు. అక్కడ ఉన్న కేడీ, ఢిల్లీలో ఉన్న మోడీని ఎదుర్కొన్న.. అప్పుడు నేను అధైర్య పడలేదు. 5 సీట్లు ఉన్న కాంగ్రెస్ కి 65 సీట్లు ఇచ్చి నిలబెట్టారు.. ఇక్కడ కాంగ్రెస్ ను నిలబెట్టేందుకు షర్మిలమ్మ పోరాటం చేస్తోంది. షర్మిలమ్మకి నేను అండగా నిలబడతా.. షర్మిలమ్మను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే వరకు నేను అండగా ఉంటాన‌న్నారు.

APCC చీఫ్ వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు - ఆంధ్రుల ఊపిరి అన్నారు. విశాఖ స్టీల్ ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవం అని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్ అని అన్నారు. 1960లో జరిగిన ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. విశాఖ ఉక్కు కోసం తెలంగాణ లో సైతం ర్యాలీలు తీశారు. విశాఖ ఉక్కు ఇందిరమ్మ నెలకొల్పిన పరిశ్రమ అని పేర్కొన్నారు. నష్టాల్లో ఉంటే నిధులు ఇచ్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకున్నది. వైఎస్సార్ హయాంలో విశాఖ కోసం ఎంతో చేశాడన్నారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే విశాఖ ఉక్కు కి సొంత మైన్ ఉండేదన్నారు. 2014 వరకు విశాఖ స్టీల్ లాభాల్లో ఉంది. దొంగలు దొంగలు ఊర్లు దోచుకున్నట్లు.. విశాఖ ఉక్కు ను దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అప్పుల పాలు చేసి దోచుకోవాలని చూస్తున్నారు.. అప్పుల పేరు చెప్పి ప్రైవేటీకరణ కు కుట్ర కు తెరలేపారని ఆరోపించారు. కుక్కను చంపాలి అంటే ముందు పిచ్చిది అని పుకార్లు పుట్టించాలి. విశాఖ స్టీల్ అమ్మేందుకు ఇదే సామెత ను అమలు చేస్తున్నారని అన్నారు. విశాఖ స్టీల్‌కు ఐరెన్ ఓర్ ఇవ్వడం లేదు, బొగ్గు ఇవ్వడం లేదు, కరెంట్ ఉత్పత్తి కాకుండా చూస్తున్నారు. మొత్తం విశాఖ ను అమ్మాలని చూస్తున్నారని ఆరోపించారు.

ఇక్కడ గంగవరం పోర్ట్ ను జగన్ ఆన్న అమ్మేశాడు. కేవలం 600 కోట్లకు అమ్మేశాడు. పక్కనే ఉన్న జింక్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేశారు. ఉద్యోగులను తలలించి రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. విశాఖ భూముల కోసమే ప్రైవేటీకరణ.. లాభాల్లో ఉన్న పరిశ్రమను అప్పుల్లో కి కావాలని నెట్టారని ఆరోపించారు. ఇవ్వాళ జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగుల జీవితాలను రోడ్డున పడేశారు. ఇక్కడ ప్రతిపక్షాలకు సోయి లేదు. పాలకపక్షం, ప్రతిపక్షం రెండు దొందు దొందే.. విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ చేయను అని జగన్ ఒక తీర్మానం చేశాడు.. తీర్మానంతో సరిపెట్టి ఊరుకున్నాడని దుయ్య‌బ‌ట్టారు. తీర్మానం చేసే బదులు ఒక్క ఉద్యమైనా ఎందుకు చేయలేదు? అని ప్ర‌శ్నించారు. చంద్రబాబు బీజేపీతో పొత్తులు పెట్టుకుంటున్నాడు. విశాఖ స్టీల్ ను అమ్ముతుంటే బీజేపీతో పొత్తుకు పోతున్నారా.? జగన్, బాబు ఇద్దరు మోదీ దగ్గర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం తాకట్టు పెట్టారు. ఇలాంటి వాళ్ళను గెలిపించడం అవసరమా? అని ప్ర‌శ్నించారు.

Updated On 16 March 2024 11:23 PM GMT
Yagnik

Yagnik

Next Story