RevanthReddy In Tirumala: తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న తెలంగాణ సీఎం
తిరుమల వెంకటేశ్వర స్వామిని తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు
తిరుమల వెంకటేశ్వర స్వామిని తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఆయనతో పాటు భార్య, కుమార్తె , అల్లుడు మనవడు ఉన్నారు. మనవడి పుట్టు వెంట్రుకల కార్యక్రమం కోసం ఆయన మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ముడుపులు చెల్లించడానికి ఆలయంలోకి కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు. ఆలయంలోకి వైకుంఠం క్యూ లైన్ ద్వారా ఆయన చేరుకున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22 నుండి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరుగనున్నాయి. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపడతారు. అలాగే రాత్రి 7 .30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మే 23వ తేదీ ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.