తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజులు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, ములుగు, సూర్యాపేట, భూపాలపల్లి, మహబూబాబాద్, జిల్లాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం ప్రకారం ఉత్తర కోస్తా, యానాం ప్రాంతంలో ఆదివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంగా వీస్తాయని సూచించింది. సోమవారం నాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.


Sreedhar Rao

Sreedhar Rao

Next Story