తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు(TDP Chief Chandrababu Naidu) ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆకాశానికెత్తేసే ఆ పార్టీ అనుకూల మీడియా ఇప్పుడూ అదే పని చేస్తోంది. బీజేపీ(BJP)తో పొత్తు(Alliance)కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారన్న విషయం తెలిసిందే!

తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు(TDP Chief Chandrababu Naidu) ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆకాశానికెత్తేసే ఆ పార్టీ అనుకూల మీడియా ఇప్పుడూ అదే పని చేస్తోంది. బీజేపీ(BJP)తో పొత్తు(Alliance)కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారన్న విషయం తెలిసిందే! చంద్రబాబే పొత్తు కోసం తాపత్రయపడుతున్నారని తెలిస్తే జనం ఏమనుకుంటారోనని బీజేపీ అధినాయకత్వమే పొత్తు పెట్టుకుందాం రమ్మని చంద్రబాబును పిలిచిందని ఓ వర్గం మీడియా కథనాలు రాసింది. పైగా చంద్రబాబుకు ఇష్టం లేకున్నా తప్పడం లేదంటూ భాష్యాలు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు ద్రోహం చేసిన పార్టీగా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 2019 ఎన్నికలప్పుడు చంద్రబాబు కూడా ఇదే మాటన్నారు. బీజేపీని, ప్రధాని మోదీ(PM Modi)ని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టారు. ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయోనని చంద్రబాబు అనుకున్నారు కానీ, వాటిని తీర్చడానికి మీడియా ఉందిగా! కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీనే మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ విషయానికి వస్తే ముఖ్యమంత్రి జగన్‌(CM Jagan)ను ఒంటరిగా ఎదుర్కోవడానికి శక్తిసామర్థ్యాలు సరిపోవడంలేదు. జగన్‌ను ఎదుర్కోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం అన్నది చంద్రబాబు భావన. బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా రేపొద్దున అధికారంలోకి వచ్చినా కష్టమేనని అనుకుంటున్నారు. దీనికి కలరింగ్‌ ఏమిస్తున్నారంటే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఎన్డీయేలో చేరాల్సి వస్తున్నదని చంద్రబాబు చెబుతున్నారు. రాజధాని(AP Capital) నిర్మించాలన్నా, పోలవరం(Polavaram Project) పూర్తి చేయాలన్నా, నిధులను సమకూర్చుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం(Central Govt) సహాకారం అవసరమని, ఆ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని టీడీపీ అనుకూల మీడియా రాయడం మొదలు పెట్టింది. ప్రజలు నిజమే కావచ్చని అనుకునేంత వరకు ఈ రకమైన కథనాలను వండి వార్చడానికి రెడీ అయ్యాయి. ఇదే నిజమనుకుందాం! కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ఉంటే అభివృద్ధి వందేభారత్‌ రైలంత వేగంగా పరుగులు పెడుతుందనే అనుకుందాం! 2014లో కూడా బీజేపీతో టీడీపీ పొత్తు(TDP Alliance With BJP) పెట్టుకున్నది కదా! అప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నాయి కదా! మరి అయిదేళ్ల పాటు ఏపీ ఎందుకు అభివృద్ధి సాధించలేదు? రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఎందుకు నిధులు పారించలేదు? అప్పుడు చేయలేనిది ఇప్పుడు ఎలా చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. దాదాపు నాలుగేళ్లపాటు కేంద్రంలో పదవులను కూడా అనుభవించిన టీడీపీ ఆ తర్వాత మోదీతో కటిఫ్‌ చేసుకుంది. రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం ద్రోహం చేసిందని చంద్రబాబు తీవ్రంగా విమర్శించిన సంగతి ప్రజలకు ఇంకా గుర్తుంది. నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మోదీని వ్యక్తిగతంగా కూడా విమర్శించారు చంద్రబాబు. రాజ‌ధాని నిర్మాణానికి పిడికెడు మ‌ట్టి, చెంబు నీళ్లు త‌ప్ప‌, ఏ సాయం చేయ‌లేద‌ని ప్ర‌ధాని మోదీపై విమ‌ర్శ‌లు చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీ, అదే నాయకుడితో చెలిమికి ప్రయత్నించడమే విడ్డూరం. అన్నట్టు జనసేన అధినేత పవన్ కూడా తను చేసి పాచిపోయిన లడ్డూలనే కామెంట్‌ను గుర్తు చేసుకుంటే మంచిదని కొందరు సలహా ఇస్తున్నారు.

Updated On 9 Feb 2024 1:37 AM GMT
Ehatv

Ehatv

Next Story