Chandrababu : టీడీపీ కార్యకర్తలకు రోడ్డుప్రమాదం.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన చంద్రబాబు
కుప్పం మహిళల ముఖాముఖి సమావేశాన్ని ముగించుకుని తిరుగు ప్రయాణం చూస్తుండగా టీడీపీ కార్యకర్తలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

TDP workers met with a road accident.. Chandrababu visited the hospital
కుప్పం మహిళల ముఖాముఖి సమావేశాన్ని ముగించుకుని తిరుగు ప్రయాణం చూస్తుండగా టీడీపీ కార్యకర్తలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రామకుప్పం మండలం ఆనిగానూరు గ్రామానికి చెందిన చెందిన చలమయ్య (32) , నాగభూషణం (38) తీవ్రంగా గాయపడగా.. క్షతగాత్రులను పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. చలమయ్య (32) చికిత్స పొందుతూ మృతిచెందగా.. తీవ్ర గాయాలతో నాగభూషణం(38) ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
విషయం తెలియడంతో కార్యకర్తల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఈఎస్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రమాదం గురించి ఆరా తీశారు. డాక్టర్లను మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం బాధితులను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ కార్యకర్త చలమయ్య(32) కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు అన్నిరకాల ఆదుకుంటాను అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
