✕
Mangalagiri Party Office : టీడీపీ ఆఫీసులో కార్యకర్త ఆత్మహత్యాయత్నం..!
By ehatvPublished on 22 April 2025 6:28 AM GMT
మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో దాసరి బాబురావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు.

x
మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో దాసరి బాబురావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. దెందులూరులో మట్టి మాఫియా(Sand Mafia) వేధిస్తున్నారని ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాబురావును వెంటనే మణిపాల్ హాస్పిటల్(Manipal Hospital)కు తరలించారు. డాక్టర్లు అతని పరిస్థితిని విషమంగా ఉన్నట్లు తెలిపారు. బాబురావు(Baburao) టీడీపీ సెంట్రల్ ఆఫీసులో ఆత్మహత్యాయత్నం చేయడం ద్వారా, ఆయన తన సమస్యను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలని భావించి ఇలా చేశారని భావిస్తున్నారు. సొంత పార్టీ కార్యాలయంలో ఇలాంటి ఘటన జరగడం విశేషం. టీడీపీ ప్రభుత్వం మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని... ఇసుక తవ్వకాలను నియంత్రించడానికి పారదర్శక విధానాలు, వ్యవస్థలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ehatv
Next Story