తెలుగు మహిళా అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి(Shakila Reddy) ఆధ్వర్యంలో రాంగోపాల్‌ వర్మ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగుదేశం(TDP) పార్టీపైనా, చంద్రబాబు, లోకేష్‌, పవన్‌కల్యాణ్‌ పైనా బురద జల్లుతూ అవాస్తవాలు, అభూతకల్పనలు సృష్టించి రాంగోపాల్‌వర్మ చేత సైకో జగన్‌ ‘వ్యూహం’ పేరిట ఒక చెత్త సినిమాను నిర్మించారని అన్నారు. రాంగోపాల్‌వర్మ ఒక సైకో అని అతడిని మించిన మరో సైకో జగన్‌(Jagan) అని షకీలారెడ్డి అన్నారు.

తెలుగు మహిళా అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి(Shakila Reddy) ఆధ్వర్యంలో రాంగోపాల్‌ వర్మ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగుదేశం(TDP) పార్టీపైనా, చంద్రబాబు, లోకేష్‌, పవన్‌కల్యాణ్‌ పైనా బురద జల్లుతూ అవాస్తవాలు, అభూతకల్పనలు సృష్టించి రాంగోపాల్‌వర్మ చేత సైకో జగన్‌ ‘వ్యూహం’ పేరిట ఒక చెత్త సినిమాను నిర్మించారని అన్నారు. రాంగోపాల్‌వర్మ ఒక సైకో అని అతడిని మించిన మరో సైకో జగన్‌(Jagan) అని షకీలారెడ్డి అన్నారు. ఇద్దరు పిచ్చివాళ్లు కలిసి ఒక పిచ్చి కథను తయారు చేసి ప్రజల మీదకు వదులుతున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయాలనుకుంటే జగన్‌ తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని రూ.43వేల కోట్లు అడ్డంగా ప్రజల నుంచి ఏవిధంగా దోచుకున్నాడనే అంశం మీద, కోడికత్తి డ్రామా పైనా, బాబాయ్‌ని దారుణంగా గొడ్డలితో నరికి చంపిన అంశంమీద, తాను చంపి అదే నేరాన్ని చంద్రబాబుపై(Chandrababu) నెట్టి ఊరూరా అబద్ధపు ప్రచారం చేసి ప్రజల సానుభూతి పొంది ఓట్లు సంపాదించిన విధానంపైనా వర్మ(RGV) సినిమాలు తీయాలి అని షకీలారెడ్డి డిమాండ్ చేసారు.

జగన్‌ ఎన్నికలలో తన తల్లిని, చెల్లిని వాడుకొని అవసరం తీరిన తరువాత పార్టీ నుంచి మెడపెట్టి బయటకు గెంటివేసిన విధానంపైన సినిమాలు(Cinema) తీస్తే రక్తికట్టి ఉండేది అని అన్నారు.దేశం రాజకీయ నాయకుల్లో కుట్రలు, కుతంత్రాలలో ఆరితేరినవాడు, అత్యంత అవినీతిపరుడు, నేరస్తుడు జగన్‌ అని షకీలారెడ్డి అన్నారు కుట్రలు, కుతంత్రాలకు మారుపేరు జగన్‌ అయితే.. జగన్‌పైనే చంద్రబాబు, లోకేష్‌(Lokesh) కుట్రలు పన్నుతున్నట్లు సినిమాలు తీయటం విడ్డూరం అని వర్మ జగన్‌ క్రిమినల్‌ చర్యలపై సినిమాలు తీస్తే బాగుంటుందన్నారు . తన దగ్గర కుప్పలుగా పడిఉన్న అవినీతి సొమ్ముతో ఇటువంటి పిచ్చి సినిమాలు తీసి ప్రజలపై వదులుతున్న జగన్‌కు వచ్చే ఎన్నికల్లో(Elections) ప్రజలు గుణపాఠం చెప్పి తీరతారన్నారు.

Updated On 27 Dec 2023 8:31 AM GMT
Ehatv

Ehatv

Next Story