TDP Vs Pawan Kalyan : టీటీడీ చైర్మన్ బాధ్యత తీసుకోవసరం లేదా..
తిరుపతిలో జరిగిన సంఘటనకు రాజకీయకోణంలో చూడకుండా మానవీయకోణంలో పవన్ కల్యాన్ చూశారని జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర అన్నారు.
తిరుపతిలో జరిగిన సంఘటనకు రాజకీయకోణంలో చూడకుండా మానవీయకోణంలో పవన్ కల్యాన్ చూశారని జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర అన్నారు. ప్రతి ఒక్క క్షతగాత్రుడిని పరామర్శించారు, కూలంకుషంగా నివేదిక తీసుకున్నారు. బాధ్యతలను పోలీసులు, అధికార యంత్రాంగం నిర్వర్తించలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. బాధ్యత తీసుకుని పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పారు. శవరాజకీయాలకు జగన్ పెట్టింది పేరు. సంఘటన జరిగిన వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి తిరుపతి వెళ్లారు. ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. కింద కేంద్రాలు పెట్టిందే గత ప్రభుత్వం. అధికారయంత్రాంగం పూర్తిగా విఫలమైంది. క్యూలో ఉన్న భక్తులకు మంచినీరు, టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించలేకపోయారని నాగేంద్ర అన్నారు. ప్రభుత్వంలో ఉండి బాధ్యతగా క్షమాపణ కోరుతున్నా అన్న మొదటి నేత పవన్ కల్యాణ్. టీటీడీ చైర్మన్, ఈవో ఎందుకు బాధ్యత తీసుకోలేదనే పవన్ ప్రశ్నించారని నాగేంద్ర అన్నారు.