TDP Version On Chandrababu Arrest : సీమెన్స్ ప్రాజెక్టుపై ఆరోపణలు.. తెలుగుదేశంపార్టీ వివరణలు
రెండు లక్షలపై చిలుకు యువతకు నైపుణ్య శిక్షణ అందించి 64 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును(Skill Development Project) చూసి జగన్(Jagan Mohan Reddy) ఓర్వలేకపోతున్నారు. సీమన్స్ స్కల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో(Seaman's Skill Development Project) 250 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ అబద్దపు ప్రచారం చేస్తున్నారు. సీమెన్స్, డిజైన్ టెక్, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అనే మూడు సంస్థలు కలిపి ఈ ప్రాజెక్టు కోసం ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకున్నాయి.

TDP Version On Chandrababu Arrest
రెండు లక్షలపై చిలుకు యువతకు నైపుణ్య శిక్షణ అందించి 64 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును(Skill Development Project) చూసి జగన్(Jagan Mohan Reddy) ఓర్వలేకపోతున్నారు. సీమన్స్ స్కల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో(Seaman's Skill Development Project) 250 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ అబద్దపు ప్రచారం చేస్తున్నారు. సీమెన్స్, డిజైన్ టెక్, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అనే మూడు సంస్థలు కలిపి ఈ ప్రాజెక్టు కోసం ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వాటా పది శాతం మాత్రమే. మిగిలిన 90 శాతం వాటా సీమెన్స్ కంపెనీ భరిస్తుంది. రెండు లక్షల కోట్ల రూపాయల జగన్ కుటుంబ అవినీతిని కప్పిపుచ్చేందుకు, ఆర్ధిక మాంద్యం దిశగా పయనిస్తున్న రాష్ట్ర ఆర్ధిక దుస్థితి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే మాజీ ఐఎఎస్ అధికారి లక్ష్మీనారాయణపై, గంటా సుబ్బారావులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
2021 ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా సీమెన్స్, డిజైన్ టెక్‌లు నెలకొల్పిన 40 స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల కాలేజీ యాజమాన్యాలు తమ శిక్షణ కేంద్రాలు అద్భుతంగా నడుస్తున్నాయని లేఖలు ఇస్తే, 2021 డిసెంబర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు బోగస్ అని ఎఫ్‌ఐఆర్ ఏ విధంగా నమోదు చేస్తారు? ఇది కుట్ర కాక మరేమిటి? కడప ఇడుపుల పాయ ఎస్టేట్ సమీపానికి కూడా స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని తీసుకెళ్లిన ఘనత చంద్రబాబునాయుడుది! ఎలాంటి రాజకీయ దురుద్దేశం, కక్షపూరిత ధోరణి లేకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న చంద్రబాబు సంకల్పానికి ఇది నిదర్శనం. యువతకు స్వర్ణయుగం అనేలా నైపుణ్యాభివృద్ధి, నిరుద్యోగ భృతి అందించే వేలాది మంది తమ కాళ్లపై తాము నిలబడేలా చేసిన చంద్రబాబు(chandrababu), లోకేశ్‌లపై(Lokesh) ఆరోపణలు చేయడం జగన్ సైకోయిజానికి నిదర్శనం.
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు డబ్బులకు సంబంధించి అగ్రిమెంట్ పరంగా, ఫిజికల్ వెరిఫికేషన్ పరంగా, వాల్యూయేషన్ పరంగా సీఐడీ తయారు చేసిన రిమాండ్ రిపోర్ట్ ఆసాంతం ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పథకం ప్రకారం కుట్రపూరితంగా తయారు చేశారు.
షెల్ కంపెనీలకు బదలాయించిన 250 కోట్ల రూపాయలు డిజైన్ టెక్ కంపెనీ ఖాతాకే తిరిగి చేరిందని రిమాడ్ రిపోర్ట్ పేజీ నంబర్ 2లో రాశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్సెస్ వారు పన్ను ఎగవేతలకు సంబంధించి చేసిన దర్యాప్తులో డిజైన్ టెక్ కంపెన ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పొందడం కోసం కొంత పన్ను ఎగవేశారని డీజీజీఐ పూణెవారు కేసు ఫైల్ చేయడం జరిగింది.
జీస్టీకి సంబంధించి ఏడు కోట్ల రూపాయల ట్యాక్స్ రిఫండ్స్(Tax Refund) పొందడం కోసం డిజైన్ టెక్ కంపెనీ వారు అలా చేశారని అనేక జాతీయ దిన పత్రకల్లో వచ్చింది. కానీ ఎక్కడా 241కోట్ల రూపాయలు ఆవిరి అయ్యాయని చెప్పలేదు. సీఐడీ వారికి పన్ను ఎగవేతకు, డబ్బులు మింగేయడానికి తేడా తెలియదా? పన్ను ఎగవేతకు సంబంధించిన ఓ విషయాన్ని తీసుకొచ్చి ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌కు సీఐడీ అంటగడుతుంది.
ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండ, కాలేజీలకు వెళ్లి పరిశీలించకుండా సీఐడీ అధికారులు ఎలా చెబుతారు? శరత్ అండ్ అసోసియేట్స్ ఫోరెన్సిక్ నివేదికలోన పేజీ నంబర్ 12లో, పాయింట్ (ఎ)లో సదరు శరత్ అండ్ అసోసియేట్స్ వారు తాము స్కిల్ డెవలప్‌మెంట్‌కు చెందిన 40 కేంద్రాలలో ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదని స్పష్టంగా పేర్కొన్నారు. ఫోరెన్సిక్ అడిట్ సంస్థ ఎంపికకు సంబంధించిన టెండర్‌లో ముందు ఫిజికల్ వెరిఫికేషన్ క్లాజ్ పెట్టి తర్వాత దాన్ని తొలగించినందునే తమకు ఫిజికల్ వెరిఫికేషన్ ఏసే అవకాశం దక్కలదని స్పష్టంగా చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫిజికల్ వెరిఫికేషన్ వద్దన్నందుకే తాము చేయలేదని శరత్ అండ్ అసోసియేట్స్ అడిట్ రిపోర్ట్ చెబుతోంది. ప్రభుత్వం ఫిజికల్ వెరిఫికేషన్ చేయవద్దని ఎందుకు చెప్పింది? ఫిజికల్ వెరిఫికేషన్ జరిగితే ఈ ప్రభుత్వ బండారం ఎక్కడ బయటపడుతుందో, ఎక్కడ వారు పూయాలనుకున్న అవినీతి బురద పూయలేకపోతామో అన్న ఆలోచనతో ఇది వద్దన్నారా? ఒప్పందం ప్రకారం తాము పెట్టాల్సిన 90 శాతం పెట్టుబడికిగాను సీమెన్స్, డిజైన్ టెక్ వారు 40 కేంద్రాలకు సంబంధించిన అన్ని రకాల సాఫ్ట్‌వేర్ మరియు అధునాతన పరకరాలకు అందించడం జరిగింది. ఇదే విషయాన్ని 40 కాలేజీలు, విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు లిఖిత పూర్వకంగా ధ్రువకరించాయి.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వారికి 40 కాలేజీల యాజమాన్యాలు తాము సిమన్స్, డిజైన్ టెక్ వారి నుంచి పొందిన వివిధ అధునాతన పరికరాలు, సాఫ్ట్‌వేర్ మొదలగు వాటిని స్టాక్ రిజిస్టర్‌లలో పొందుపరిచి సంతకాలు చేసి మరి అందిచడం జరిగింది. అంతేకాకుండా తమకు సిమెన్స్ నుంచి అందిన పరికరాలన్నీ అద్భుతంగా పని చేస్తున్నాయని తమ కేంద్రాలలో విద్యార్థులు కూడా మంచి శిక్షణ పొందుతున్నారని లిఖిత పూర్వకంగా 2021 ఆగస్టులో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు లేఖలు అందించాయి.
ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జేఎన్‌టీయూకే ఇంజనీరింగ్ కాలేజీ కాకినాడ, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీ విశాఖపట్నం, జీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జి.పుల్లారెడ్డి కాలేజీ కర్నూలు వంటి ప్రతిష్టాత్మకమైన కాలేజీలే కాకుండా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలోని ఇడుపులపాయ ఎస్టేట్‌కు అతి సమీపంలో ఉన్న ట్రిపుల్ ఐటీ కూఆ తమ స్టాక్ రిజిస్టర్‌లను, లేఖలను స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వారికి అందించడం జరిగింది. ఈ రోజున స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై బురద జల్లుతున్న వైసీపీ నాయకులు ఎవరైనా వారికున్న అనుమానాలను ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి వెళ్లి నివృతి చేసుకోవచ్చు. మొత్తం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయంపై ఎక్కడా ఎలాంటి క్రాస్ వెరిఫికేషన్ కూడా జరగలేదని కూడా రిమాండ్ రిపోర్ట్‌లో చెప్పారు.
