TDP Team : పుంగనూరు ఘటనపై గవర్నర్‌ను కలవనున్న టీడీపీ బృందం
శనివారం ఉదయం 11 గంటలకు టీడీపీ బృందం గవర్నర్ ను కలవనుంది. శుక్రవారం పుంగనూరు- తంబళ్లపల్లెలో జరిగిన దాడులకు సంబంధించి టీడీపీ నేతలు గవర్నర్ కి ఫిర్యాదు చేయనున్నారు.
శనివారం ఉదయం 11 గంటలకు టీడీపీ బృందం(TDP Team) గవర్నర్(Governor)ను కలవనుంది. శుక్రవారం పుంగనూరు(Punganur)- తంబళ్లపల్లె(Thamballapalle)లో జరిగిన దాడులకు సంబంధించి టీడీపీ నేతలు(TDP Leaders) గవర్నర్ కి ఫిర్యాదు చేయనున్నారు. నిన్న జరిగిన ఘర్షనలు, దాడులకు సంబంధించి వీడియోలను టీడీపీ బృందం గవర్నర్ కి అందజేయనుంది. వైసీపీ(YSRCP) కార్యకర్తల దాడిలో టీడీపీకి చెందిన వారు గాయపడ్డారని ఆరోపిస్తున్న ఆ పార్టీ నేతలు.. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా గవర్నర్ కు అందజేయనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) పర్యటన నేపథ్యంలో చిత్తూరు(Chittoor) జిల్లా పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 'ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పర్యటనలో భాగంగా అంగళ్లు నుంచి పుంగనూరు వస్తున్న చంద్రబాబు రాకను వ్యతిరేకిస్తూ.. వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించాయి. దీంతో టీడీపీ(TDP), వైసీపీ(YCP) శ్రేణులు మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. వాహనాలను ధ్వంసం చేసుకున్నారు. అడ్డుకోబోయిన పోలీసుల(Police)పై కూడా రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు టియర్‌గ్యాస్(Tear Gas) ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలతో పాటు పోలీసులకు సైతం గాయాలయ్యాయి.