విశాఖపట్నం పోర్టులో(Vizag port) భారీ మొత్తంలో డ్రగ్స్‌ దొరకడంతో(drugs seize) తెలుగుదేశంపార్టీకి(TDP) మింగలేకా కక్కలేకా సతమతమవుతోంది. డ్రగ్స్‌ దందాలో ఉన్నవారంతా తెలుగుదేశంపార్టీకి సన్నిహితులే అని తేలినప్పటికీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా(Yellow Media) దాన్ని పక్కదోవ పట్టించేందుకు నానా తంటాలు పడుతోంది. వేళ్లన్నీ టీడీపీవైపు చూపుతున్నా ఓ వర్గం మీడియాకు మాత్రం దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఉంది.

విశాఖపట్నం పోర్టులో(Vizag port) భారీ మొత్తంలో డ్రగ్స్‌ దొరకడంతో(drugs seize) తెలుగుదేశంపార్టీకి(TDP) మింగలేకా కక్కలేకా సతమతమవుతోంది. డ్రగ్స్‌ దందాలో ఉన్నవారంతా తెలుగుదేశంపార్టీకి సన్నిహితులే అని తేలినప్పటికీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా(Yellow Media) దాన్ని పక్కదోవ పట్టించేందుకు నానా తంటాలు పడుతోంది. వేళ్లన్నీ టీడీపీవైపు చూపుతున్నా ఓ వర్గం మీడియాకు మాత్రం దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఉంది. బ్రెజిల్‌(Brazil) నుంచి విశాఖ పోర్టుకు భారీగా డ్రగ్స్‌ను దిగుమతి చేసిన సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ చైర్మన్‌ కూనం వీరభద్ర చౌదరి(Koonam Veerabhadra Chaudhary), అధిపతి కూనం కోటయ్య చౌదరిలే(Koonam Kotaiah Chaudhary) కదా! వారిద్దరు తెలుగుదేశంపార్టీలో ప్రముఖులైన నానా, నందమూరి, రాయపాటి, ఆలపాటి, దామచర్ల, లావు కుటుంబాలకు చాలా దగ్గర కదా! ఈ విషయాలను ఎలా కాదనగలరు? పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయని తెలిసిన వెంటనే చంద్రబాబునాయుడు(chandrababu), పవన్‌ కల్యాణ్‌లతో(Pawan kalyan) పాటు చాలా మంది పెడబొబ్బలు పెట్టారు. ఇప్పుడు బండారం బయటపడటంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోక ప్రభుత్వంపై దుష్ర్పచారానికి దిగుతున్నారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించే కుట్రపట్టారు. ఎప్పటిలాగే ఈ కుట్రలో ఆయనకు దగ్గరగా ఉన్న మీడియా భాగస్వామి అయ్యింది. ఓ పక్క సీబీఐ అధికారులు సోదాలు చేస్తునప్పుడే తెలిసి తెలియనితనంతో చంద్రబాబు, లోకేశ్లు వరుసగా ట్వీట్లు చేశారు. అనుకూల మీడియా అయితే గగ్గోలు పెట్టింది. అయితే అయితే కూనం కోటయ్య చౌదరితో టీడీపీ నేతల వ్యాపార బంధం వెలుగు చూడటంతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. చంద్రబాబు వదిన, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఫ్యామిలీతో కూనం కుటుంబానికి ఉన్న వ్యాపార బంధం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. రాయపాటి, దామచర్ల, లావు కుటుంబ సభ్యులతో కూనం కోటయ్య చౌదరి కలసి ఉన్న ఫోటోలు తాజాగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కూనం వీరభద్ర చౌదరితో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజాకు ఉన్న బంధాన్ని రుజువు చేసే వ్యాపార లావాదేవీల పత్రాలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలోనే బీజేపీతో తెలుగుదేశంపార్టీ పొత్తు పెట్టుకుంటుందనే సంకేతాలు వచ్చాయి. వెంటనే బ్రెజిల్‌ నుంచి భారీ మొత్తంలో మాదకద్రవ్యాల దిగుమతికి తెర లేచింది. ఇవన్నీ ప్రాథమిక విచారణలో వెల్లడైన నిజాలు. అయినా టీడీపీ అనుకూల మీడియాలో మాత్రం భిన్నమైన కథనాలు వస్తున్నాయి.

Updated On 23 March 2024 12:09 AM GMT
Ehatv

Ehatv

Next Story