ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌(APCC) సారథ్య బాధ్యతలను వై.ఎస్‌.షర్మిలకు(YS Sharmila) అప్పగించింది పార్టీ అధినాయకత్వం. ఏపీ పార్టీ చీఫ్‌గా షర్మిల నియమితులవ్వడం ఆమె అభిమానులకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో అంతకు మించి డబుల్‌ ట్రిపుల్‌ ఆనందంతో తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూల మీడియా(Yellow Media) డ్యాన్సులు చేస్తోంది. తమకు తోచిన కథనాలను వండివార్చింది.

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌(APCC) సారథ్య బాధ్యతలను వై.ఎస్‌.షర్మిలకు(YS Sharmila) అప్పగించింది పార్టీ అధినాయకత్వం. ఏపీ పార్టీ చీఫ్‌గా షర్మిల నియమితులవ్వడం ఆమె అభిమానులకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో అంతకు మించి డబుల్‌ ట్రిపుల్‌ ఆనందంతో తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూల మీడియా(Yellow Media) డ్యాన్సులు చేస్తోంది. తమకు తోచిన కథనాలను వండివార్చింది. షర్మిల రావడంతోనే జగన్‌(Jagan) గుండెలు అదిరిపోయాయి అన్నట్టుగా రాతలు ఉన్నాయి. అన్నపై విమర్శల దాడి చేయడానికి షర్మిల వస్తున్నారహో అంటూ రాసుకొచ్చాయి. అంటే షర్మిలకు, అనగా కాంగ్రెస్‌ పార్టీకి కేవలం జగన్మోహన్‌రెడ్డి మాత్రమే శత్రువా? తెలుగుదేశంపార్టీ, జనసేన(Janasena), బీజేపీలను(BJP) ఏమీ అనరా? నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు బద్ధశత్రువు టీడీపీనే కదా! ఆ పార్టీపై షర్మిల పల్లెత్తు మాట కూడా మాట్లాడరా? టీడీపీ అనుకూల మీడియా వైఖరి చూస్తుంటే టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ త‌దిత‌ర పార్టీల‌కు ష‌ర్మిల స్నేహితురాల‌ని చెప్పేస్తున్నాయి.

ఇలాంటి రాత‌లు రాసి ఏం సాధించాలనుకుంటున్నాయి. ఈ రాతలు జగన్‌కు కీడు చేస్తాయా? లేక మేలు చేస్తాయా? రేపొద్దున్న జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనే శక్తి లేక అందరూ ఒక్కటయ్యారని ప్రజలు అనుకోరా? ప్రజలకు ఆ రకమైన భావన వస్తే నష్టం ఎవరికి? ఇంత చిన్న లాజిక్‌ కూడా టీడీపీ అనుకూల మీడియాకు తట్టలేదంటే ఏమనుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే టీడీపీ- జనసేనలు కూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీ కరుణకటాక్షల కోసం ఎదురుచూస్తున్నాయి. బీజేపీ యెస్‌ అంటే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి(alliance) ఎన్నికల బరిలో దిగుతుంది. బీజేపీతో తాము కలిసే ఉన్నామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) చెబుతూ వస్తున్నప్పటికీ రెండు పార్టీలు కలిసి ఎన్నికల చర్చ జరిపింది లేదు. మరోవైపు టీడీపీ-జనసేనలతో పొత్తు విషయమై ఇంత వరకు బీజేపీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఆ పొత్తును తేల్చే బాధ్యతను జాతీయ నాయకత్వానికి అప్పగిస్తూ ఈ మధ్యనే ఏపీ బీజేపీ ఓ తీర్మానం చేసింది. ఎందుకో తెలియదు కానీ టీడీపీతో పొత్తుకు బీజేపీ పెద్దలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో పార్టీకి ఎలాంటి ఎదుగుదల ఉండదన్నది అధిష్టానం అభిప్రాయం. కేవ‌లం జ‌న‌సేన‌తో మాత్ర‌మే క‌లిసి వెళ్లాల‌ని బీజేపీ ఆస‌క్తి చూపుతోంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మాత్రం బీజేపీ కంటే టీడీపీపైనే ప్రేమను ఒలకబోస్తున్నారు. మోదీ(Modi), అమిత్‌షా(amit shah), నడ్డాలపై గౌరవమర్యాదలు చాటుకుంటూనే చంద్రబాబుతో కలిసి తిరుగుతున్నారు. పండుగలు చేసుకుంటున్నారు. పొత్తు పెట్టుకున్నారు. కాకపోతే ఎవరు ఎన్ని స్థానాల నుంచి పోటీ చేస్తారన్నదానిపై క్లారిటీ రాలేదు. కాంగ్రెస్‌ పార్టీనేమో ఎప్పటిలాగే వామపక్షాలతో పొత్తు పెట్టుకోవాలనుకుంటోంది. మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీతో కూడా చర్చలు జరుపుతోంది. ఏపీలో రాజకీయ సినేరియో ఇలా ఉంటే, టీడీపీ అనుకూల మీడియా మాత్రం అన్న జగన్‌పై చెల్లెలు షర్మిల దాడి చేయడం గ్యారంటీ అంటూ కథనాలు రాస్తోంది. ఎందుకో ఏమో రాసేవారికైనా తెలుసో తెలియదో!

Updated On 17 Jan 2024 12:59 AM GMT
Ehatv

Ehatv

Next Story